*”విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఫీజు పోరు” -కాకాణి*

*SPS నెల్లూరు జిల్లా:*
*తేది:31-01-2025*

*ఫిబ్రవరి 5న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న “వైయస్సార్సీపీ ఫీజు పోరు” పోస్టర్ ను వైకాపా జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించిన మాజీమంత్రి మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*

*కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు రూరల్ నియోజవర్గ ఇంచార్జ్ ఆనం విజయ కుమార్ రెడ్డి, విద్యార్డి భాగం జిల్లా అధ్యక్షుడు అశ్రీత్ రెడ్డి, విద్యార్థి విభాగ నాయకులు, తదితరులు.*

*విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా “వైయస్సార్సీపీ ఫీజు పోరు” కార్యక్రమం తలపెట్టామని, విద్యార్థులు, తల్లితండ్రులు పాల్గొని విజయవంతం చేయాలని కాకాణి పిలుపు.*

*కాకాణి మాట్లాడుతూ..*

👉ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చెయ్యాలి..

👉విద్యా దీవెన, వసతి దివేనకు సంబంధించి 2900 కోట్ల రూపాయల బకాయిలు తక్షణమే విడుదల చేసి, విద్యార్థులను ఆదుకోవాలి.

👉 ఫీజులు బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

👉ఫీజులు కట్టే స్తోమత లేక విద్యార్థులు చదువుకు దూరమై మనోవేదనకు గురవుతున్నారు..

👉ఫీజు బకాయిలు చెల్లించేదాకా సర్టిఫికెట్స్ ఇవ్వమని కాలేజీ యాజమాన్యం విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయి..

👉ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో హాల్ టికెట్లు నిరాకరిస్తున్న విద్యా సంస్థల యాజమాన్యాలు.

👉ఫీజు బకాయిలు చెల్లించలేక చదువుకు దూరమవుతున్నామన్న ఆందోళనతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న పసి బిడ్డలు.

👉 ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకే ఫిబ్రవరి 5న కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు శ్రీకారం చుట్టాం.

👉 మహనీయుడు డా౹౹బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి ఉదయం 10 గంటలకు నివాళూలర్పించి, అక్కడ నుండి ర్యాలీగా కలెక్టరేట్ కు వెళ్లి, వినతి పత్రం సమర్పిస్తాం.

👉విద్యార్థులు, తల్లితండ్రులు పొరుబాటలో స్వచ్చందంగా పాల్గొని, విజయవంతం చేయాలని కోరుతున్నాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed