*కోవూరులో వైసిపికి భారీ షాక్, ఇది వి.పి.ఆర్ మార్క్*.

– తుస్సుమన్న “ప్రసన్న” విప్ అస్త్రం
– వైసిపి వీడి టిడిపి బాట పట్టిన బుచ్చి పట్టణ కన్వీనర్ టంగుటూరు మల్లారెడ్డి.
– కండువా మార్చేసిన 10 వ వార్డు కౌన్సిలర్ టివి మల్లారెడ్డి.
– టిడిపి నేతల టచ్లో మరో ముగ్గురు కౌన్సిలర్లు.
– నిరాశ, నిసృహలో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న శిబిరం.

బుచ్చిరెడ్డి పాళెం నగర పంచాయతి వైస్ చైర్మన్ ఎన్నిక మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి పరాభవాన్ని మిగల్చనుంది. విప్ జారీ చేసి వైస్ చైర్మన్ పదవి కైవసం చేసుకోవాలని ప్రసన్న కన్న కలలు భగ్నమయ్యాయి. బుచ్చి పట్టణ వైసిపి కౌన్సిలర్లు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి జై కొడుతూ సైకిల్ ఎక్కేస్తున్నారు. బుచ్చి నగర పంచాయతిలో జరగనున్న వైస్ చైర్మన్ ఉప ఎన్నికలో నిన్నటి దాకా అభ్యర్థిని బరిలో దింపుతానని ప్రగాల్భాలు పలికిన ప్రసన్న యిప్పుడు అంతర్మథనంలో పడ్డారు. వైసిపి కౌన్సిలర్ల వలసలు చూసాక నిన్నటి దాకా విప్ జారీ పై హడాహుడి చేసిన మాజీ ఎమ్మెల్యే ప్రసన్న శిబిరం డీలా పడి పోయింది. వైసిపి సీనియర్ నాయకులు ఇప్పగుంట మల్లారెడ్డి గారి నేతృత్వంలో 10 వార్డు కౌన్సిలర్ బెళుం మల్లారెడ్డి గారితో పాటు బుచ్చి మండల వైసిపి కన్వీనర్ టంగుటూరు మల్లికార్జున్ రెడ్డి, సీనియర్ నాయకులు చెన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కంఠం నరసింహులు, ఆర్కే రవి ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గార్ల సమక్షంలో టిడిపి తీర్ధం పుచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న నియంతృత్వ ధోరణిని నిరసిస్తూ తాము టిడిపి బాట పట్టామన్నారు. వేమిరెడ్డి దంపతుల నాయకత్వంలో బుచ్చిరెడ్డి పాళెం అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed