*పేదలకు సాయం పేరుతో దోచేసిన డబ్బుతో కరోనా ప్యాలెస్*

*వైసీపీ ఐదేళ్ల పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం*

*సర్వేపల్లి నియోజకవర్గంలో బీసీల ఆస్తుల విధ్వంసం, అక్రమ కేసులు, రౌడీషీట్లు*

*చేసిన పాపాలకు మే 13వ తేదీన మూల్యం చెల్లించుకోబోతున్న కాకాణి గోవర్ధన్ రెడ్డి*

*ఏ సర్వేలో చూసినా ఎన్డీఏ కూటమిదే ప్రభంజనం*

*టీడీపీ -బీజేపీ – జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీలకు 50 ఏళ్లకే పింఛన్*

*మంగళవారం తోటపల్లి గూడూరు మండలం వరిగొండలో నిర్వహించిన జయహో బీసీ సదస్సులో సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతంగా ఉన్న రిజర్వేషన్లను వైసీపీ పాలనలో 24 శాతానికి తగ్గించారు

చేతివృత్తుల వారికి ఎంతో అండగా నిలిచిన ఆదరణ పథకాన్ని ఎత్తేశారు

బీసీలకు చెందాల్సిన రూ.34 వేల కోట్ల నిధులను మళ్లించేశారు.

ఆర్భాటంగా 56 కార్పొరేషన్లు పెట్టి నిధులు ఇవ్వకుండా నామమాత్రంగా మిగిల్చారు

ఎందరో బీసీలు వైసీపీ నేతల అరాచకానికి ప్రాణాలు కోల్పోయారు

ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే కాకాణి అరాచకలతో బీసీ నేతల ఆస్తులు ఎన్నో విధ్వంసానికి గురయ్యాయి

కోడూరు పంచాయతీ చెన్నపల్లిపాళెంలో 16 ఎకరాల రొయ్యలగుంతలను ధ్వంసం చేయించి రూ.కోటి విలువైన రొయ్యలను సముద్రంలోకి వదిలేశారు

పొదలకూరు మండలం నల్లపాళెంలోనూ యాదవులు సాగుచేసుకుంటున్న 16 ఎకరాల సంపంగి తోటలను ధ్వంసం చేయించి వారి కడుపు మీద కొట్టాడు

వెంకటాచలం మండలంలో నాగేంద్ర భూముల్లోని లారీ కాటాను, సెల్ ఫోన్ టవర్లను ధ్వంసం చేయించాడు

టీడీపీ వెంకటాచలం మండల అధ్యక్షుడు గుమ్మడి రాజా యాదవ్ పై అక్రమ కేసులతో రౌడీ షీటు ఓపెన్ చేయించాడు.

వెంకటాచలంలోనే యనమల రాజేంద్ర బృందంపై అక్రమ కేసు బనాయించి జైలుకు పంపాడు

జంగాలపల్లి రాజగోపాల్ తదితరులను కూడా అక్రమ కేసులతో జైల్లో పెట్టాడు

దళిత సోదరుడు ఉదయగిరి నారాయణను పొదలకూరు పోలీసు స్టేషన్లో చంపి చెట్టుకు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించారు

వెంకటాచలం, కనుపూరులో ఇద్దరు ముస్లింలను కాకాణి రైట్ హ్యాండ్ అయిన ఎస్సై కొట్టి చంపేశాడు

ఈ ఐదేళ్లలో సర్వేపల్లి నియోజకవర్గంలో నెలకొన్న ఘోరమైన పరిస్థితులను చరిత్రలో ఎప్పుడూ చూడలేదు

రెండో సారి ఎమ్మెల్యే అయిన తెల్లారి నుంచే దోపిడీకి తెరలేపిన కాకాణి గోవర్ధన్ రెడ్డి కరోనాను కూడా వదల్లేదు

పేదలకు సాయం పేరుతో కోట్ల రూపాయలు దండేసి నెల్లూరులో ఉంటున్న ఇంటి వెనుకే విలాస వంతమైన భవనం కట్టాడు

కరోనా సాయం పేరుతో రైతులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తల నుంచి దండిన డబ్బుతో కట్టిన ఇంటికి వైసీపీ నేతలే కరోనా ప్యాలెస్ అని పేరు పెట్టారు

వేలకోట్లు దోపిడీ చేసినా కాకాణి ధన దాహం తీరడం లేదు. మట్టి, మషానం, బూడిద, ఇసుక, తెల్లరాయి దేనినీ వదిలిపెట్టడం లేదు

కాకాణి దెబ్బకు కృష్ణపట్నం పోర్టులోని కంటైనర్ టెర్మినల్ పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయింది. 10 వేల మందికి పైగా యువత ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడ్డారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *