అద్దంకి ప్రభుత్వ పాలిటెక్నిక్ ఆంగ్ల అధ్యాపకులు రాజకుమార్ కు డాక్టరేట్ ప్రధానం.
అద్దంకి పట్టణం లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లో ఆంగ్ల అధ్యాపకులు గా పని చేస్తున్న రాజకుమార్ కి విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పి హెచ్ డి ని ప్రధానం చేసింది. రవీంద్రనాథ్ ఠాగూర్ రచనల మీద ” హ్యుమానిజం అండ్ సివిలైజేషన్ ఇన్ the సెలెక్ట్ ప్రొజ్ వర్క్స్ అఫ్ రబీంద్రనాథ్ ఠాగూర్ : ఎ కాంటెంపొరరీ పర్స్పెక్తివ్” అన్ని అంశం ప్రధాన ఇంటివృత్తం గా తన పరిశోధన సాగిందని రాజకుమార్ ఒక పత్రికా ప్రకటనలో తెలియ చేశారు. అంతరించి పోతున్న మానవతా విలువల్ని, విశ్వ మానవ కుటుంబం యొక్క ఆవశ్యకత ను రవీంద్రుడి రచనల ఆధారంగా నేటి ప్రపంచానికి తన పరిశోధన చాటి చెపుతోందని డాక్టర్ రాజకుమార్ తెలియచేసారు. యూనివర్సిటీ లోని ఆంగ్ల శాఖలో పని చేస్తున్న ఆంగ్ల ప్రొఫెసర్ ప్రభాకర్ ఈ పరిశోధనా వ్యాసానికి పర్యవేక్షకులు గా వ్యవహరించారు.