నారా లోకేష్ కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డారు.

నారా లోకేష్ యువగళం తో ప్రజల్లో విశ్వాసాన్ని నింపారు.

గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన విద్యా వ్యవస్థను నారా లోకేష్ గాడిలో పెడుతున్నారు.

నారా లోకేష్ జన్మదినాన్ని పండగల చేసుకున్నాం.

– సోమిరెడ్డి, అజీజ్, కోటంరెడ్డి

నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బాణాసంచా పేల్చి కేక్ కటింగ్ నిర్వహించారు.

కార్యక్రమంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, టిడిపి నేతలు కంభం విజయరామి రెడ్డి, చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, డాక్టర్ జెడ్ శివ ప్రసాద్ లు పాల్గొన్నారు.

సోమిరెడ్డి కామెంట్స్:-

నారా లోకేష్ కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డారు. ఎన్టీఆర్ మనవడిగా చంద్రబాబు తనయుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు.

నారా లోకేష్ యువగళం తో ప్రజల్లో విశ్వాసాన్ని నింపారు.

గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన విద్యావ్యవస్థను నారా లోకేష్ గాడిలో పెడుతున్నారు.

చరిత్రలో ఎన్నడు లేని విధంగా లక్షల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి తేవటంలో నారా లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

వారసత్వం పేరుతో వ్యవస్థలను తప్పుదోవ పట్టించకుండా ఒక సిస్టంతో ముందుకు వెళుతున్న నాయకుడు నారా లోకేష్.

నారా లోకేష్ రెడ్బుక్ తెరవాల్సిందే రాష్ట్రాన్ని నరక కూపంలోకి నెట్టేసిన వారికి గుణపాఠం చెప్పాల్సిందే.

అప్పుడే కార్యకర్తలు విశ్వాసం కలుగుతుంది రాష్ట్రం గాడిలో పడుతుంది దుర్మార్గులకు చరమగీతం పాడినట్లు అవుతుంది.

అబ్దుల్ అజీజ్ కామెంట్స్:-

నారా లోకేష్ జన్మదినాన్ని పండుగలా చేసుకున్నాం.

నారా లోకేష్ ను చంద్రబాబు తీర్చిదిద్దుతున్నారు నారా లోకేష్ రాష్ట్రానికి అమూల్యమైన నాయకుడిలా మారబోతున్నారు.

నాయకుడిగా మారాలంటే ప్రజల గుండెచప్పుడు వినాలి యువగళం తో వేల కిలోమీటర్లు తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకున్నారు.

ఒక అనుభవమైన లెజెండ్ లీడర్ నాయకత్వంలో నారా లోకేష్ పని చేస్తున్నారు.

చంద్రబాబు రాష్ట్రానికి యువ నాయకులను అందిస్తున్నారు జీవితకాలం ఆయనే ఉండాలన్న ఆలోచన కలిగిన వారు కాదు చంద్రబాబు.

కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కామెంట్స్:-

యువగళం తో నారా లోకేష్ సత్తా చాటారు. నారా లోకేష్ ను హోప్ ఆఫ్ ది ఆంధ్ర ప్రదేశ్ గా ప్రజలు భావిస్తున్నారు.

గతంలో నారా లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు అనేక అవార్డులు ఆయనను వరించాయి.

తిరిగి అదే స్థాయిలో లోకేష్ పనిచేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలవబోతున్నారు.

కార్యక్రమంలో పెద్ద ఎత్తున టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *