*రెడ్ బుక్ ఓపెన్ చేయాల్సిందే..రాష్ట్రాన్ని నరకంలోకి నెట్టేసిన వారికి గుణపాఠం చెప్పాల్సిందే*
*వారసుడిగా కాకుండా సిస్టమేటిక్ నాయకుడిగా ఎదుగుతున్న నారా లోకేష్ బాబు*
*నెల్లూరులో ఘనంగా నారా లోకేష్ బాబు పుట్టినరోజు వేడుకలు*
*జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల కోలాహలం మధ్య లోకేష్ బాబు బర్త్ డే కేక్ కట్ చేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డుచైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తదితరులు*
*మీడియాతో సోమిరెడ్డి కామెంట్స్*
మంత్రి నారా లోకేష్ బాబు పుట్టినరోజును తెలుగుదేశం పార్టీ కేడర్ రాష్ట్ర వ్యాప్తంగా పండగలా జరుపుకొంటోంది
యువ నాయకుడిగా, ఎన్టీఆర్ మనుమడిగా, చంద్రబాబు నాయుడు కుమారుడిగా టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు కేడర్ కి అండగా నిలిచారు
టీడీపీ నాయకులు, కార్యకర్తలకే కాదు…రాష్ట్ర ప్రజలకు కూడా ఒక భరోసా కల్పించారు
వైసీపీ పాలనలో విద్యా శాఖను నాశనం చేయడంతో పాటు తరగతుల విలీనం పేరుతో చిన్నారులకు విద్యను దూరం చేశారు
ఇప్పుడు లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రిగా విద్యారంగంలో సమూల మార్పులు తెస్తున్నారు
ఐటీ మంత్రిగా రాష్ట్రానికి కోట్లాది రూపాయల పెట్టుబడులు రావడంలో తండ్రి చంద్రబాబు నాయుడితో కలిసి కీలకపాత్ర పోషిస్తున్నారు
గతంలో వారసత్వం పేరు చెప్పుకుని రాష్ట్రాన్ని నాశనం చేసినవాళ్లను చూశాం
లోకేష్ బాబు వారసుడిగా కాకుండా ఒక సిస్టమేటిక్ నాయకుడిగా ఎదుగుతున్నారు
వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాలు, ఇప్పటికీ ప్రవర్తిస్తున్న తీరుపై లోకేష్ బాబు రెడ్ బుక్ ఓపెన్ చేయాల్సిందే..రాష్ట్రాన్ని నరకంలోకి నెట్టేసిన వారికి గుణపాఠం చెప్పాల్సిందే
అప్పుడే కార్యకర్తలకు కాన్ఫిడెన్స్ లభించడంతో పాటు రాష్ట్రం గాడిలో పడుతుంది. దుర్మార్గులకు చరమగీతం పాడినట్టు కూడా అవుతుంది