*స్కిల్ కేసులో సుప్రీం తీర్పుపై సోమిరెడ్డి కామెంట్స్*
స్కిల్ డెవలెప్ మెంట్ కేసులో నారా చంద్రబాబు నాయుడికి హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని గత వైసీపీ ప్రభుత్వం వేయించిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేయడం సంతోషదాయకం.
జగన్ రెడ్డి ఆటలు సాగలేదు.
పండగ పూట తెలుగు ప్రజలందరికీ ఇది శుభవార్త.
అన్యాయంగా పెట్టిన ఈ కేసులో నుంచి కూడా బాబు గారు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు.
ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది.
గత ఐదేళ్లు అభివృద్ధి లేకపోగా అరాచకం రాజ్యమేలింది.