జగన్ రికార్డులు బద్దలు కొడుతున్న పవన్- తాజాగా ఈ మూడు..!

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి అభివృద్ధిని పక్కనబెట్టేశారనే విమర్శలు ఎదురయ్యాయి. అయినా అప్పటి సీఎం వైఎస్ జగన్ ఇవేవీ పట్టించుకోకుండా తనదైన శైలిలో పాలన చేసుకుంటూ వెళ్లిపోయారు. చివరికి జనం అభివృద్ధి కోసమే అన్నట్లుగా కూటమి పార్టీలకు ఓటేసి భారీ మెజార్టీతో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించారు. ఇప్పుడు పాలనలోనూ కూటమి సర్కార్ అదే విషయంలో వైసీపీ సర్కార్ రికార్డుల్ని బద్దలు కొడుతోంది

ముఖ్యంగా రాష్ట్రంలో కీలకమైన పంచాయతీ రాజ్ శాఖ నడిపిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో వైసీపీ ప్రభుత్వం సాధించిన రికార్డుల్ని తుడిచి పెట్టే పనిలో బిజీగా కనిపిస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఏ రికార్డులు సాధించామని ఘనంగా చెప్పుకుందో వాటిని తుడిచి పెడుతూ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో గతంలో ఓ మూడు కీలక అంశాల్లో అప్పటి జగన్ సర్కార్ సాధించిన ఘనతలు పక్కకు వెళ్లిపోయాయి. అలాగే పవన్ కళ్యాణ్ దూకుడు కూడా ఇందులో కనిపిస్తోంది.

వీటిలో రాష్ట్రంలో సీసీ రోడ్ల నిర్మాణం, మినీ గోకులాల ఏర్పాటు, అరుదైన గిరిజన తెగలకు ఆవాసాల ఏర్పాటు (పీవీటీజీ హ్యాబిటేషన్స్ ) వంటి అంశాలున్నాయి. వీటిలో సీసీ రోడ్ల నిర్మాణాన్ని చూసుకుంటే గత వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో 1800 కిలోమీటర్ల మేర జరిగింది. అదే ఆరు నెలల కూటమి పాలనలో పవన్ శాఖ పంచాయతీ రాజ్ ఏకంగా 3750 కిలోమీటర్ల రోడ్లను నిర్మించింది.

అలాగే మినీ గోకులాల విషయానికొస్తే గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కేవలం 268 మాత్రమే నిర్మించగా.. ఆరు నెలల కూటమి పాలనలో ఏకంగా 22500 నిర్మించినట్లు తెలుస్తోంది. అలాగే గిరిజన ప్రజల ఇళ్ల నిర్మాణానికి వైసీపీ హయాంలో రూ.91 కోట్లు ఖర్చుపెడితే ఎన్డీఏ హయాంలో ఏకంగా రూ. 750 కోట్లు ఇచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ శాఖ గత జగన్ సర్కార్ లెక్కల్ని ఎంత వేగంగా అధిగమిస్తోందో తెలుస్తోంది.

(జన హుషార్ న్యూస్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *