తిరుపతి, 11-1-2025, శనివారం.

*ఆంధ్రుల మనోభావాలను మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దెబ్బతీస్తున్నారు : చింతామోహన్, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.*

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు.

వైజాగ్ సభలో నరేంద్ర మోడీ విశాఖ ఉక్కును నిలబెడతాను. అమ్మనని ఒక్క మాటంటే ఎంత బాగుండేది.!!

ఆంధ్రుల మనోభావాలను మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దెబ్బతీస్తున్నారు.

ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు నేను చూశాను. ఆయన స్పీచ్ చాలా బాధ కలిగించింది. ఏపీ ప్రయోజనాలను కాపాడే విధంగా అగుపించలేదు.

విశాఖ ఉక్కు కోసం ఆరోజు రైతులు త్యాగాలు చేశారు. 25 వేల ఎకరాలు భూములిచ్చారు. ఈ రోజు ఒక్కో ఎకరా 100 కోట్లు ధర పలుకుతోంది.

రెండు సంవత్సరాలుగా కార్మికులు పోరాటాలు చేస్తుంటే, దాని గురించి ఒక్క మాట మాట్లాడలేకపోయారు.

విశాఖ ఉక్కును నిలబెట్టండి అని ఒక్క మాట మోడీని అడిగి ఉంటే ఎంత బాగుండేది. ఇదే ఎన్టీఆర్ అయితే ఆగి ఉండేవాడా??

మోడీకి చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు. నేను కూడా చాలామంది ప్రధాన మంత్రులను చూశాను. నేనెప్పుడూ పిఎం లను చూసి భయపడలేదు.

ఇందిరా గాంధీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ కంటే మోడీ పొడుగా??

చిన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయనంటే నాకు అభిమానం ఉంది. కానీ విశాఖ సభలో ఆయన ప్రసంగం చాలా బాధ కలిగించింది.

విశాఖ ఉక్కును ఆపే దానికి వీలు లేదు. ఫ్యాక్టరీ జరగాల్సిందే. ఉండాల్సిందే.

“ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు” ప్రత్యేక హోదా గురించి పవన్ కళ్యాణ్ విశాఖ సభలో ఎందుకు మాట్లాడలేదు??

ఎక్కడో పిఠాపురంలో కూర్చొని టీటీడీ బోర్డు సభ్యులు క్షమాపణలు చెప్పాలని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు.

ఆంధ్రులకు జరుగుతున్న అన్యాయం గురించి ఏ ఒక్కరూ నోరు తెరవకపోవడం అన్యాయం. ఈ విషయంలో కమ్యూనిస్టు పార్టీలే కొంచెం మాట్లాడుతున్నారు.

పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి, తేనేటి విశ్వనాథం, ప్రకాశం పంతులు వంటి మహానుభావులు పుట్టిన ఈ నేలన వాళ్ళ వారసులు లేరా?? ఆంధ్రులకు జరుగుతున్న అన్యాయం గురించి ఏ ఒక్కరూ మాట్లాడరే??

పుచ్చలపల్లి సుందరయ్య గారు వేసెక్టమీ చేసుకోకుండా ఉంటే, ఆయన కొడుకులు నేడు ప్రశ్నించే వారేమో!!

ఆంధ్రులకు ఏ ఒక్కరికీ వెన్నుపూస లేదా?? పౌరుషం లేదా?? అని నేనడుగుతున్నాను.

వైకుంఠ ద్వారదర్శన టోకెన్లు జారీలో జరిగిన తొక్కేసిరిలాట టిటిడి, పోలీస్ అధికారుల సమన్వయ లోపమే.

ఎక్కడో పార్కుల్లో భక్తులను తోలి, టోకన్లు జారీ చేయడం ఎందుకు? మహతి ఆడిటోరియం, ఎస్వీయూ ఆడిటోరియం, మెడికల్ కళాశాలలో ఆడిటోరియం, వేదిక్ యూనివర్సిటీలో ఆడిటోరియం ఇలా చాలా ప్రదేశాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవడంలో అధికార యంత్రాంగం వైఫల్యం చెందారు.

5000 మంది భక్తులను కంట్రోల్ చేయడంలో, టీటీడీ, పోలీసు యంత్రాంగం మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది.

కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వైకుంఠ ఏకాదశికి లక్ష మందికి పైగా భక్తులకు దర్శనం ఇచ్చిన చరిత్ర ఉంది.

టీటీడీలో పనిచేసే రిటైర్డ్ అయిన ఎంతోమంది అనుభవజ్ఞులు ఉన్నారు. వారి సేవలను టీటీడీ ఉపయోగించుకోవాలి. భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తపడాలి.

తొక్కిసలాటకు గురై మృతి చెందిన వారి కుటుంబాలకు శాశ్వత ఉద్యోగాలు ఇవ్వాలి.

లడ్డు కల్తీపై విచారణ నివేదిక ఏమైంది.?? ఆ నివేదికను బయటపెట్టాలి.

ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు యార్లపల్లి గోపి గౌడ్, రవి, తేజోవతి, ముని శోభ, రావణ్, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *