*అన్న క్యాంటీన్లో తనిఖీల్లో భాగంగా బ్రేక్ఫాస్ట్ చేసిన మంత్రి పొంగూరు. నారాయణ*
నగరంలోని 48,50,51,52 డివిజన్ల లో పర్యటించి
పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించిన మంత్రి
*పారిశుద్ధ్య సిబ్బందికి పలు సూచనలు
విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని వార్నింగ్*
*సంతపేటలో చేపల మార్కెట్ సందర్శించిన మినిస్టర్*
*అన్న క్యాంటీన్లో బ్రేక్ఫాస్ట్ చేసిన మంత్రి
*తిరుపతి ఘటన బాధాకరం జ్యూడిషియల్ విచారణకు సీఎం ఆదేశించారు*
*గత ప్రభుత్వ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసింది*
*ముఖ్యంగా రెండు లక్షల 25 వేల మంది కడుపు నింపే అన్న క్యాంటీన్లను మూసేసి పేదల కడుపు కొట్టింది*
*పర్వత రెడ్డి వ్యాఖ్యలను పట్టించుకోను*
*చంద్రశేఖర్ రెడ్డి ఆరోపణలను కొట్టిపారేసిన నారాయణ*
———————-నెల్లూరు సిటీ
*నెల్లూరు నగరంలో 47,48,50,51,52 డివిజన్ల లోని తోట బడి, పాత మున్సిపల్ ఆఫీస్ .కుక్కలగుంట.జలకన్య బొమ్మ, సంతపేట మార్కెట్ ప్రాంతాల్లో ఉదయం 5 గంటల మంత్రి పొంగూరు నారాయణ ఆకస్మిక తనిఖీలు చేశారు*
పారిశుధ్య కార్మికుల మస్టర్లు తీసుకున్నారు.
స్థానిక ప్రజల సమస్యల అడిగి తెలుసుకున్నారు
*మంత్రి గారి కామెంట్స్…*
*వర్షాకాలానికి ముందే ముఖ్య మంత్రిగారి ఆదేశాల మేరకు మున్సిపాలిటీల్లో డీసిల్టింగ్ పనులు చేపట్టాం. దీని కోసం మున్సిపాలిటీలకు 50 కోట్లు నిధులు కేటాయించాం*
*గదా ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి*
ఇస్టానుసారంగా నిధులు దారి మళ్లించడం వల్ల కేంద్రం నుండి రాష్ట్రానికి ,మున్సిపాలిటీలకు రావలసిన. 5300 కోట్లు ఆగిపోయాయి
రాబోయే మూడేళ్లలో మున్సిపాలిటీల్లో 100శాతం సాలిడ్ వేస్ట్ ,లిక్విడ్ వేస్ట్, త్రాగునీరు ,రహదారుల సమస్యలు పరిష్కరిఇస్తాం.
వీటి కోసం డిపిఆర్లు తయారు చేస్తున్నాం.
డిపిఆర్ లు కేంద్రానికి నివేదించి నిధులు తీసుకొస్తాం.
అభివృద్దే నా బాట నేనెప్పుడూ చెత్త రాజకీయాలు,నీచ రాజకీయాలు చేయలేదు
2014 -19 చేసిన అభివృద్ధి వల్లనే 2024 లో 70 వేల మెజార్టీతో నెల్లూరు ప్రజలు నన్ను గెలిపించారు.
సంతపేట మార్కెట్లో పాత బట్టల వ్యాపారం చేసు కునే వారికి షాప్ లు గతం లో కేటాయించాం.
*వాటిలో 72 షాపులకు గాను 50 షాపులు ఖాలీగా వున్నాయి.*
షాపులు కేటాయించ బడిన వారు వ్యాపారం చేసు కోవాలి.
లేకపోతే వారికి ఇచ్చిన షాపులను రద్దు చేసి అర్హులైన పెద వారికి ఇస్తాం.
ఉయ్యాల కాలువ లో వర్షాకాలంలో సిల్ట్ తొలగించాం.
పూడుకు పోయిందని స్థానికులు చెప్పారు.
మరల సిల్ట్ తొలగిస్తాం.
ముఖ్యంగా ఉదయాన్నే కూలి పనులకు వెళ్లే నిరుపేదల కోసం 2014లో అన్న క్యాంటీన్లను ప్రారంభించాం.
తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ వంటి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పరిశీలించి అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసాం
*జగన్మోహన్ రెడ్డి మా మీద కోపంతో అన్నా క్యాంటీన్లను మూసేసి రెండు లక్షల 25 వేల మంది పొట్టకొట్టారు*
*అందుకే అతన్ని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారు*
*కేవలం ఐదు రూపాయలకే మూడు పూటలా భోజనం పెడుతూ 56 రూపాయలు సబ్సిడీని ప్రభుత్వం భరిస్తూ అన్న క్యాంటీన్లను నడుపుతున్నాం*
*కొన్నిచోట్ల సకాలంలో ఆహార పదార్థాలు రావడం లేదని స్థానికులు చెబుతున్నారు*
*దీనిపై ఏజెన్సీ నిర్వాహకులతో మాట్లాడాలని డైరెక్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ హరి నారాయణతో ఫోన్లో మాట్లాడి సకాలంలో ఆహార పదార్థాలు చేరుకునేలా చూడాలని ఆదేశాలు జారీ చేశాం*
క్యాంటీన్లో ఫుడ్ క్వాలిటీ చాలా బాగుంది. ఏదో చేసామని కాకుండా పేద లకు మంచి భోజనం అందాల అన్నదే ప్రభుత్వ ఆలోచన
రూరల్ ప్రాంతాల్లో 67 అన్నా క్యాంటీన్లను త్వరలోనే ప్రారంభిస్తాం