*విద్యుత్ భవన్, జనవరి 10*
*విద్యుత్ భవన్ లో మహిళా ఉద్యోగస్తులకు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ముగ్గుల పోటీలను ఏర్పాటు*
ఈరోజు విద్యుత్ భవన్ లో మహిళా ఉ ద్యోగస్తులకు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ వి. విజయన్ గారు ఈ ముగ్గుల పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది. సూపరిండెంటింగ్ ఇంజనీర్ గారు ఈ పోటీలను ప్రారంభించారు.
న్యాయనిర్ణతలుగా అకౌంట్స్ ఆఫీసర్ విజిత గారు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లక్ష్మీప్రసన్న గారు, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ నాగమణి గారు,ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ బాలచంద్ర, సోమశేఖర్ రెడ్డి, శ్రీధర్,పరంధామయ్యలు వ్యవహరించారు. ఈ పోటీలలో మొత్తం 50 మంది పాల్గొనడం జరిగింది.
బహుమతులు ప్రధానం చేయడానికి ప్రముఖ డెంటల్ డాక్టర్ జి.దివ్య రెడ్డి ఎం.డి.ఎస్.గారు (జి.కొండారెడ్డి సూపర్ స్పెశాలిటీ డెంటల్ హాస్పిటల్ )విజేతలకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. మొదటి బహుమతిగా జూనియర్ అసిస్టెంట్ పి. రాజేశ్వరి జూనియర్ అసిస్టెంట్ సెంట్రల్ ఆఫీస్, రెండవ బహుమతి బి.గాయత్రి ఆఫీస్ అబార్డినేట్ సెంట్రల్ ఆఫీస్,మూడవ బహుమతిగా స్కాడా టీం అనూష,యమునా, షీలా, మౌనిక లకు అందించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్.ఈ.గారు మాట్లాడుతూ పాల్గొన్న మహిళ ఉద్యోగులందరికీ ప్రత్యేక అభినందనలు తెలపడం జరిగింది. బహుమతుల ప్రధానానికి మేము పిలవంగానే ఇక్కడికి విచ్చేసిన డాక్టర్ దివ్యా రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మహిళలు ముగ్గుల రూపంలో మన సంస్థ గురించి తెలపడం చాలా ఆనందంగా ఉందని ఒకరు సూర్య ఘర్ పథకం గురించి మరియు సోలార్ పలకల గురించి అలాగే ఒకరు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి ఇండియా విజన్ 2047 గురించి, అలాగే ఒకరు విద్యుత్ చౌర్యాన్ని భోగిమంటల్లో వేసేయాలని తెలిపారు. బహుమతులు అందుకున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు.
డాక్టర్ దివ్య రెడ్డి గారు మాట్లాడుతూ ఇలాంటి పోటీలు నిర్వహించడం చాలా శుభ పరిమాణం అని మన సంస్కృతికి నిదర్శనాలని తెలిపారు. నన్ను ఆహ్వానించినందుకు విద్యుత్ సంస్థ అధికారులకు సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ బాలచంద్ర, శ్రీధర్, పరంధామయ్య, సోమశేఖర్ రెడ్డి,లక్ష్మీనారాయణ, సుధాకర్,శ్రీనివాసరావు అకౌంట్స్ ఆఫీసర్ విజిత గారు,అసిస్టెంట్ ఇంజనీర్స్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, సిబ్బంది పాల్గొన్నారు