నెల్లూరు, జనవరి 10:
*నెల్లూరు నగరంతో పాటు జిల్లాలోని ఇతర పట్టణాల్లో ప్రవేటు బస్లు నడిపేందుకు ఆసక్తి కలిగిన వారు ముందుకు వస్తే వెంటనే అనుమతులిస్తాం : జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద్ తెలిపారు*.
శుక్రవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రాంతీయ రవాణా ఆధారిటీ సమావేశం నిర్వహించారు. నెల్లూరు నగరంలో ఇప్పటికే పర్మిట్ ఉన్నటువంటి రూట్లు, నూతన రూట్లలో సిటీ బస్లు తిప్పుకునేందుకు ప్రవేటు ఆపరేటర్లకు అనుమతి కొరకు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించారు. ప్రభుత్వ ప్రజా రవాణా శాఖ ( ఆర్ టి సి ) లేవనెత్తిన అనుమానాలను నివృత్తి చేసి అనుమతి మంజూరు చేయాలని సూచించారు. నెల్లూరు నగరం తో పాటు రూరల్ పరిధిలో ప్రతిపాదించిన ఇప్పటికే అనుమతి ఉన్న 7 రూట్లలో, నూతనంగా అనుమతి కోరియున్న 7 రూట్లలో ప్రవేటు బస్ సర్వీసులు తిప్పుకునేందుకు దరఖాస్తులను జిల్లా కమిటీ ఆమోదిస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఆర్ టి సి కూడా ప్రవేట్ తో పోటీ పడి టౌన్ సర్వీసులు నడపాలని సూచించారు. ప్రభుత్వ, ప్రయివేటు విభాగాలు అంతిమంగా ప్రజలకు సేవ చేసేందుకు పోటీ పడాలని కోరారు.
ఈ సమావేశంలో ఉప రవాణా కమిషనర్ చందర్, ఆర్ టి ఒ సిరి చందన, జిల్లా ప్రజా రవాణా అధికారి మురళీ బాబు, పలువురు రవాణా, ప్రజా రవాణా శాఖల అధికారులు, దరఖాస్తు చేసుకున్న ప్రవేట్ ఆపరేటర్లు పాల్గొన్నారు.
( జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయం, నెల్లూరు వారిచే జారీ చేయడమైనది )