*ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ షేక్.అబ్దుల్ అజీజ్ తో ఎంపీ రఖీబుల్ హుస్సేన్ భేటీ*
దేశంలో 10 లక్షల టాప్ మెజారిటీతో గెలిచిన ఏకైక ఎంపీ హుస్సేన్
– షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు.
ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తో ధుబోరి ఎంపీ రఖీబుల్ హుస్సేన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, దేశంలో పది లక్షల టాప్ మెజారిటీతో గెలిచిన ఏకైక ఎంపీ రఖీబుల్ హుస్సేన్.పార్టీలు వేరైనా ఆయన మాకు సోదర సమానులు వారికి మేము ఆతిథ్యం ఇచ్చాం. అనేకమార్లు ఆయన అనేక శాఖల మంత్రిగా పనిచేశారు. ప్రజా ఆదరణ ఉంటే ఇలానే భారీ మెజారిటీ గల విజయం అందుతుంది.