శ్రీతేజ్ పరామర్శకు అల్లు అర్జున్ – అక్కడే బిగ్ ట్విస్ట్, పోలీసుల నోటీసులు..!!
అల్లు అర్జున్ ఎపిసోడ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరో సారి అల్లు అర్జున్ కు పోలీసులు నోటీసులు జారీ చేసారు. నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు సమయం లో విధించిన కండీషన్ల మేరకు చిక్కడపల్లి పోలీసు స్టేషన్ కు అల్లు అర్జున్ చేరుకున్నారు. కాగా, పుష్ఫ ప్రీమియర్ షో లో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ సిద్దమయ్యారు. ఇంతలో అనూహ్య పరిణామాలు తెర మీదకు వచ్చాయి.
అల్లు అర్జున్ కోర్టు షరతుల మేరకు చిక్కడపల్లి పోలీసు స్టేషన్ కు వచ్చారు. బెయిల్ మంజూరు సమయంలో అల్లు అర్జున్ ప్రతీ ఆదివారం పోలీసు స్టేషన్ కు హాజరు కావాలని కోర్టు నిబంధన విధించింది. దీనికి అనుగుణంగా అల్లు అర్జున్ స్టేషన్ కు వచ్చారు. కాగా, పుష్ఫ ప్రీమియర్ షో లో తల్లిని పోగొట్టుకొని ఆస్పత్రిలో కోమా లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ సిద్దమయ్యారు. ఈ మేరకు పోలీసుల అనుమతి కోరారు. దీంతో, పోలీసుల నుంచి రిప్లై వచ్చింది. ఆస్పత్రికి వెళ్లేందుకు పోలీసులు అల్లు అర్జున్ ను అనుమతి నిరాకరించారు. ఒక వేళ వెళ్తే, అక్కడ చోటు చేసుకునే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసారు.
కిమ్స్ ఆస్పత్రికి వెళ్లవద్దని అల్లు అర్జున్ కు పోలీసులు స్పష్టం చేసారు. దీంతో, అల్లు అర్జున్ ఆస్పత్రికి వెళ్లటం పైన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే రేవతి కుటుంబానికి పుష్ఫ టీం రూ 2 కోట్ల మేర ఆర్దిక సాయం ప్రకటించింది. అల్లు అర్జున్ ఇప్పటి వరకు రేవతి కుటుంబాన్ని పరామర్శించకపోవటం పైన విమర్శలు ఉన్నాయి. అల్లు అరవింద్, పుష్ఫ నిర్మాతలు ఇప్పటికే రేవతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సినిమా ప్రముఖులు సీఎం రేవంత్ తో భేటీ తరువాత ఈ వ్యవహారం దాదాపుగా సమిసిపోయింది. మధ్యంతర బెయిల్ మీద ఉన్న అల్లు అర్జున్ కు తాజాగా నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.
..ఇప్పుడు శ్రీతేజ్ ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ సిద్దమయ్యారు. ఇందు కోసం న్యాయ వాదుల సలహా మేరకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో, స్పందించిన పోలీసులు అనుమతి నిరాకరిస్తూ నోటీసులు పంపారు. రాంగోపాల్ పేట పోలీసులు ఈ మేరకు తాజాగా అల్లు అర్జున్ కు నోటీసులు జారీ చేస్తూ.. ఆస్పత్రికి వెళ్లవద్దని సూచించారు. దీంతో, అల్లు అర్జున్ ప్రస్తుతం కోర్టు నిబంధనల మేరకు చిక్కడపల్లి పోలీసు స్టేషన్ కు వెళ్లారు.