వీరందరి పెన్షన్ల తొలగింపు – ప్రభుత్వం తాజా ఆదేశాలు..!!

ఏపీలో కూటమి ప్రభుత్వం వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ ఏడాది సంక్షేమ పథకాల అమలు చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. అదే సమయంలో కొత్తగా రేషన్ కార్డులు.. పెన్షన్లు కొత్తవి మంజూరు పైన ఒత్తిడి పెరుగుతోంది. కొత్త రేషన్ కార్డులు.. పెన్షన్ల మంజూరు వేళ అనర్హుల ను తెలిగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు కసరత్తు మొదలు పెట్టింది. అర్హత లేకపోయి నా పెన్షన్లు పొందుతున్న వారిని గుర్తించి.. వారికి కోత వేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలతో తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వం కసరత్తు
ఏపీ ప్రభుత్వం తాజాగా అర్హత లేక పోయినా పెన్షన్ అందుకుంటున్న వారికి కోత వేయాలని నిర్ణ యం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే విషయాన్ని స్పష్టం చేసారు. అనర్హుల పెన్షన్లు తెలిగిస్తామని వెల్లడించారు. పెద్ద సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లతో వికలాంగ పెన్షన్లను తీసుకుంటున్న ట్లుగా క్షేత్ర స్థాయి నుంచి ప్రభుత్వానికి సమాచారం అందింది. అయితే, పూర్తి స్థాయిలో విచారణ లేకుండా వారికి పెన్షన్లలో కోత పెడితే సమస్యలు వస్తాయని భావిస్తోంది. దీంతో, ప్రభుత్వం ఈ తరహా పెన్షన్ల వెరిఫికేషన్ కోసం మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 8,18,900మంది మెడిక్‌, వికలాంగుల పింఛన్లు తీసుకుంటున్నారు.

మార్గదర్శకాలు జారీ
ఈ పెన్షన్లు అందుకుంటున్న వారిని ఫిజికల్‌గా వెరిఫికేషన్‌ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా టీమ్‌లను నియమించింది. మెడికల్‌ ఫింఛన్‌ దారులను వారి ఇంటివద్ద మెడికల్‌ టీమ్‌ తనిఖీలు చేస్తుంది. వీరితో పాటు వికలాంగుల పింఛన్లు తీసుకునే వారి లో ఆర్ధోఫెడిక్‌ హ్యాండిక్యాప్డ్‌, దృష్టిలోపం, వినికిడి లోపం, మెంటల్‌ రిటార్డేషన్‌, మానసిక అనారో గ్యం, బహుళ వైకల్యం ఉన్న వారు ఈ కేటగిరిలోకి వస్తారు. ఇంటింటింకి వచ్చిన వెరిఫికేషన్‌ టీమ్‌ పింఛన్‌ లబ్దిదారులను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించాలని ప్రభుత్వం తాజా మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. లబ్దిదారులకు దగ్గరగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులు.. మెడికల్ కాలేజీల్లో వెరిఫికేషన్ చేయించాలని నిర్దేశించింది.

వెరిఫికేషన్ పూర్తయ్యాకే
పింఛన్‌ దారులను తనిఖీ చేసే టీమ్‌లో ఆర్ధోపెడీషియన్‌, జనరల్‌ పిజీషియన్‌, పిహెచ్‌సి మెడికల్‌ ఆఫీసరు, డిజిటల్‌ అసిస్టెంట్‌ ఉంటారు. ఏ కారణంతో పెన్షన్ తీసుకుంటన్నారో… సంబంధిత వైద్యుల ద్వారా రీ వెరిఫికేషన్ చేయించనున్నారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు టీమ్‌లను ఏర్పాటు చేసేలా ప్రభుత్వం స్పష్టం చేసింది. తనిఖీల సమయంలో 18 ప్రశ్నలకు పించన్‌ దారుని నుంచి సమాధానాలు రాబట్టాల్సి ఉంటుంది. ఈ రీ వెరిఫికేషన్ ప్రక్రియలో ఎవరైనా ఆరోపణలు ఉన్నట్లుగా బోగస్ సర్టిఫికెట్లతో పెన్షన్లు పొందుతున్నట్లుగా గుర్తిస్తే వారికి సంబంధించి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వనున్నారు. పూర్తి స్థాయిలో పరీశీలన పూర్తయిన తరువాత ప్రభుత్వం వీరికి పెన్షన్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *