
*” కాకాణికి అభినందనల వెల్లువ”*
*SPS నెల్లూరు జిల్లా:*
*తేది:02-01-2025*
*ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ మంత్రి డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు జనవరి 2వ తేదీన నెల్లూరుకు చేరుకోవడంతో, జిల్లా నలుమూలల నుండి పలువురు విచ్చేసి, ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.*
*జనవరి 2వ తేదీ మధ్యాహ్నం కాకాణి నెల్లూరుకు చేరుకున్నారన్న వార్త తెలియగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల రాకతో జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది.*
*తనను కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసిన కాకాణి.*
*2025 సంవత్సరంలో జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేయాలని, మరలా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యంగా అందరం శ్రమించాలని పిలుపునిచ్చారు.*