గిరిజన సంక్షేమ గురుకులంలో ఔట్సోర్సింగ్ టీచర్స్ మరియు లెక్చరర్స్ CRT లుగా (కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ గా) మార్పు చేసి 2022 పిఆర్సి ప్రకారం జీతాలు చెల్లించాలి.
మహారాజశ్రీ గౌరవనీయులు శ్రీమతి పరిమళగారు, ప్రాజెక్ట్ ఆఫీసర్, ఐ.టి.డి.ఏ., శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గారి దివ్యసముఖమునకు నమస్కరించి వ్రాసుకున్న విన్నపము.
అయ్యా!
గిరిజన సంక్షేమ గురుకులంలో ఔట్సోర్సింగ్ టీచర్స్ మరియు లెక్చరర్స్ CRT లుగా (కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ గా) మార్పు చేసి 2022 పిఆర్సి ప్రకారం జీతాలు చెల్లించాలని ప్రార్ధన.
మేము గత 15 సంవత్సరముల నుండి గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో అతి తక్కువ జీతాలతో విధులు నిర్వహిస్తున్నాము, మారుమూల ప్రాంతాలలో గిరిజన ప్రాంతాలలో గిరిజన బిడ్డల అభివృద్ధిలో భాగస్వాములమై మా కుటుంబాలకు దూరంగా ఉంటూ అతి తక్కువ చాలీచాలని జీతాలతో 24/7 గంటలు విధులు నిర్వహిస్తున్నాము. రెగ్యులర్ వారి కన్నా ఎక్కువ సమయము విద్యార్థుల సంరక్షణలో వారి చదువులలో కావలసినవన్నీ వారికి సమకూర్చుతూ వారి అభివృద్ధికై నిత్యము విధులు నిర్వహిస్తున్నాము. మమ్మల్ని 2008వ సంవత్సరంలో గెస్ట్ టీచర్స్ పేరుతో టీచింగ్ ఫ్యాకల్టీని రిక్రూట్ చేశారు. 2012 సంవత్సరంలో గెస్ట్ టీచర్స్ ని పార్ట్ టైం టీచర్స్ గా మార్పు చేశారు. 2017 వ సంవత్సరంలో పార్ట్ టైం టీచర్స్ ని ఔట్సోర్సింగ్ టీచర్స్ గా మార్పు చేశారు. 2010 పిఆర్సి ప్రకారం జీతాలు ఇప్పటికి అమలు జరుగుతూ ఉన్నాయి.
2016వ సంవత్సరంలో ఎస్.టి. హాస్టల్స్ ని గిరిజన గురుకులాలుగా విలీనం చేస్తూ మైదాన ప్రాంతంలో 8 జిల్లాల్లో 80 హాస్టల్స్ని కన్వెర్ట్ రెసిడెన్షియల్ స్కూల్స్ గా ఏర్పాటు చేసినారు. మా ఎంపిక విధానము రాత పరీక్ష, డెమో, రోస్టర్ కం మెరిట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరిగింది. మేము అందరం ఉన్నత విద్యా అర్హతలు కలిగి టెట్ అర్హత కూడా కలిగి ఉన్నాము. 2020 వ సంవత్సరంలో KGBV స్కూల్స్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ టీచర్స్ ని కాంట్రాక్ట్ విధానంలోకి మార్పు చేశారు. 2022 సంవత్సరంలో మోడల్ స్కూల్స్లో అవుట్సోర్సింగ్ టీచర్స్ ని కాంట్రాక్ట్ విధానంలోకి మార్పు చేసి 2022 PRC ప్రకారం జీతాలు చెల్లిస్తున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఇతర సంక్షేమ గురుకులాల్లో రెగ్యులర్స్ మరియు కాంట్రాక్ట్ వ్యవస్థలో మాత్రమే టీచర్స్ మరియు లెక్చరర్స్ ఉన్నారు. గిరిజన సంక్షేమ గురుకులాల్లో టీచర్స్ మరియు లెక్చరర్స్ పోస్టు అన్నీ కూడా శాంక్షన్ పోస్టులు.
రెగ్యులర్ వారి కన్నా ఎక్కువగా పని చేస్తున్నప్పటికీ (మా పని వేళలు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు) గత 15 సంవత్సరముల నుండి మాకు ఇతర గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లను ఏ విధముగా అయితే కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లుగా మార్చి ప్రస్తుతము ఉన్న 2022 పిఆర్సి ప్రకారము జీతాలు చెల్లిస్తున్నారో మాకు అదే విధముగా గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్స్ ను కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లుగా మార్చి 2022 పిఆర్సి ప్రకారం జీతాలు చెల్లించవలసిందిగా మరియు ఉద్యోగ భద్రత కల్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాము.
మా ప్రధాన డిమాండ్స్:
> అవుట్సోర్సింగ్ విధానం నుండి కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ గా మార్పు చేయడం.
2022 పిఆర్సి ప్రకారం జీతభత్యాలు చెల్లించడం
> మేము పనిచేస్తున్న 1143 పోస్టులను DSC నుంచి మినహాయించాలి మా కుటుంబాలను ఆదుకోవాలి అర్ధిస్తున్నాము.