*76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద అధికారులకు సూచించిన కలెక్టర్ ఒ. ఆనంద్*
శుక్రవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు గురించి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ పరిసరాలను అత్యంత పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పెరేడ్ గ్రౌండ్స్ భద్రత కు ప్రాధాన్యమిచ్చి పోలీస్ శాఖ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలిపే శకటాలను అందంగా , విజ్ఞానదాయకంగా తయారుచేసి ప్రదర్శించాలన్నారు. అలాగే వేడుకలకు హాజరయ్యే ప్రముఖులకు అల్పాహారం, ఇతర అవసరాలను గుర్తించి అందించాలన్నారు. పోలీస్, సాయుధ దళాలు, ఎన్ సి సి సంయుక్తంగా కృషి చేసి కవాతు ప్రదర్శనలివ్వాలని కోరారు. అదేవిధంగా విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ అధికారులకు సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకునే విధంగా నిర్వహించేందుకు విద్యార్థులకు తగిన తర్ఫీదునివ్వాలన్నారు. ఉద్యోగులకు అందించే మెరిట్ సర్టిఫికెట్లకు తగు ప్రతిపాదనలను నిర్ణీత సమయంలోగా పంపాలన్నారు.
ఈ సమావేశంలో నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ, డిఆర్ఓ ఉదయ భాస్కర్ రావు,ఆర్డిఓ అనూష,డిఇవో ఆర్. బాలాజీ రావు, జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి , డి ఆర్ డి ఏ, హౌసింగ్, ఏపీఎంఐపి పీడీలు నాగరాజ కుమారి, వేణుగోపాల్, శ్రీనివాసులు, డిటిసి చందర్, డిపివో శ్రీధర్ రెడ్డి, డి సి ఓ గురప్ప, ఇరిగేషన్ , ఆర్ అండ్ బి , ఆర్డబ్ల్యూఎస్ , ఎస్.ఇ లు దేశ్ నాయక్, గంగాధర్, వరప్రసాద్, జిల్లా హార్టికల్చర్ అధికారి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.