7న టౌన్ ప్లానింగ్ ఆర్.డి.డి శిక్షణ సమావేశం
– సిటీ ప్లానర్ పద్మజ
ప్రాంతీయ సంచాలకులు పట్టణ ప్రణాళికా విభాగము, గుంటూరు వారి ఆధ్వర్యంలో ఈనెల 7వ తేదీ శుక్రవారం నాడు నెల్లూరు నగర పాలక సంస్థతో పాటు ఆత్మకూరు, కావలి, బుచ్చిరెడ్డిపాలెం, అల్లూరు నగర పంచాయతీల పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది, వార్డు సచివాలయాల ప్లానింగ్ కార్యదర్శులు, ఎల్.టి.పి. లకు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు పట్టణ ప్రణాళిక విభాగం సిటి ప్లానర్ పద్మజ ఒక ప్రకటనలో తెలియజేశారు.
కార్పొరేషన్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో ఉదయం 10 గంటలకు జరగనున్న శిక్షణలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ విభాగంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్దేశించిన వివిధ మార్గదర్శకాలపై అవగాహన సదస్సు కల్పించనున్నారని తెలిపారు.
పట్టణ ప్రణాళిక విభాగంలో నూతన మార్గదర్శకాలపై అవగాహన పెంచుకునేందుకు లైసెన్స్ డ్ సివిల్ ఇంజనీర్లు, బిల్డర్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు.
కావున నెల్లూరు నగరపాలక సంస్థ, ఇతర నగర పంచాయతీల కమిషనర్లు తమ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించిన వార్డు ప్లానింగ్ కార్యదర్శులు, సిబ్బంది, ఎల్.టి.పి.లు శిక్షణకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సిటీ ప్లానర్ సూచించారు.