
SPS నెల్లూరు జిల్లా
*5 మంది బాలకార్మికులకు విముక్తి కల్పించిన నెల్లూరు పోలీసులు*
*నెల్లూరు పట్టణంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా, నెల్లూరు పోలీసుల AHTU బృందం, ఎడుకేషన్, లేబర్ శాఖ అధికారులు ప్రత్యేక డ్రైవ్*
ఆటో నగర్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, బాల కార్మికులుగా ఉన్న ఐదుగురు బాలురను గుర్తించి రక్షించడం జరిగింది.
రక్షించబడిన బాలుర తల్లిదండ్రులను పిలిపించి, బాలకార్మిక వ్యవస్థ వల్ల పిల్లల భవిష్యత్తుపై పడే దుష్ప్రభావాలను, చట్టపరమైన నిబంధనలు, శిక్షలు, పిల్లల చదువు, ఆరోగ్యం, భద్రత ప్రాధాన్యతపై విస్తృతంగా కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగింది.
కౌన్సెలింగ్ అనంతరం, తగిన హామీలు తీసుకొని పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది.
బాలల హక్కుల పరిరక్షణ, వారి సురక్షిత భవిష్యత్తు కోసం ఇటువంటి ప్రత్యేక డ్రైవ్‌లు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు పోలీసుల AHTU బృందం, AHTU ASI లు డి.సతీష్, వై.శ్రీహరి, సహాయక కార్మిక శాఖ ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వర్లు అనిల్, సుబ్రహ్మణ్యం గార్లు, నెల్లూరు నగర MEO అబ్దుల్ హమీద్ గారు, కానిస్టేబుల్ టీవీఎస్ రాంబాబు మరియు ఎన్జీవోలు పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయం, తేది.16.12.2025.