4 వ డివిజన్ లో పెద్ద సంఖ్యలో వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తల సమావేశం- డివిజన్ అధ్యక్షుడిని ఎంపిక చేసిన …
*పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.* …
—————————————-
నెల్లూరు నగరంలో 4 వ డివిజన్ జాకీర్ హుస్సేన్ నగర్ లో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తల సర్వసభ్య సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి *వందలాది కార్యకర్తలు, నాయకులు* హాజరు అయ్యారు. అందరితో సంప్రదించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* …
4 వ డివిజన్ వైసిపి ఇన్ చార్జ్ / అధ్యక్షులు గా *సందాని* గారిని..
మరియు *మధు సుధన్ రెడ్డి* గారిని కోఆర్డినేటర్ గానూ ప్రకటించారు

ఈ సందర్భంగా *డివిజన్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.*

ఈ సందర్భంగా పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాట్లాడుతూ..4 వ డివిజన్ ఇన్ చార్జ్ గా సందాని గారిని నియమించడం ఎంతో సంతోషంగా ఉందని.. డివిజన్ లో పార్టీ బలోపేతం దిశగా.. తామంతా కలిసికట్టుగా ఏకతాటిపై పనిచేస్తామని తెలిపారు

ఈ సందర్భంగా *పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు మాట్లాడుతూ..

👉 *ఈరోజు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు.. డివిజన్ ఇన్చార్జులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు నియమిస్తున్నామని తెలిపారు.*

👉 *నెల్లూరు సిటీలో పార్టీ కి సంబంధించి ఏ కార్యక్రమం జరిగిన.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా తరలివస్తున్నారని తెలిపారు.*

👉 *తెలుగుదేశం పార్టీ అబద్ధపు హామీలు గుప్పించి.. అధికారంలోకి వచ్చి ప్రజలను నిలువున దగా చేస్తుందన్నారు.*

👉 *తెలుగుదేశం పార్టీ చేతిలో మోసపోయామని ప్రజలు ఇప్పుడు తెలుసుకుంటున్నారని.. జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకున్ని.. ఎందుకు వదులుకున్నామా అని ఈరోజు ఆలోచించే పరిస్థితి వచ్చింది అన్నారు.*

👉 *ఈరోజు పార్టీ కోసం కష్టపడే నాయకులు, కార్యకర్తల సేవలను గుర్తించి.. రాబోయే రోజుల్లో వారికి సముచిత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు.*

👉 *నాలుగో డివిజన్లో ఎంతో ఉత్సాహంగా.. పార్టీని ముందుకు తీసుకెళ్ళిగే సమర్ధత కలిగిన.. సందాని గారిని డివిజన్ అధ్యక్షులుగా, మధుసూదన్ రెడ్డి గారిని కోఆర్డినేటర్ గా నియమించడం జరిగిందన్నారు.*

👉 *డివిజన్ ప్రజలు ప్రతి ఒక్కరూ.. వారి సహాయ, సహకారాలు అందిస్తూ.. డివిజన్లో పార్టీని బలోపేతం చేసే దిశగా పని చేయాలని సూచించారు.*

ఈ కార్యక్రమంలో వై ఎస్ ఆర్ సి పి మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు హంజా హుస్సేని, మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్ అహ్మద్, మేధావుల ఫోరమ్ రాష్ట్ర అధికార ప్రతినిధి సమీర్ ఖాన్, జిల్లా అధికార ప్రతినిధి నేతాజీ సుబ్బారెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ సిద్ధిక్, డివిజన్ ఇంచార్జ్ లు జయరామి రెడ్డి, మహేష్, గిరి రెడ్డి, సుబ్బారెడ్డి, స్థానిక వైసీపీ నేతలు నాగమ్మ, అభిషేక్ రెడ్డి, మస్తాన్, yaaddaani, బాలకృష్ణారెడ్డి, వైసిపి కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed