*24 గంటలలో తాగునీటి సమస్యలు పరిష్కరించండి*
– ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ నిరంతరం క్లీన్ చేయండి.
– RWS అధికారులతో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సమీక్ష.
రానున్న వేసవి సందర్భంగా తలెత్తే తాగునీటి సమస్యలు అధిగమించేలా అప్రమత్తంగా వుండాలని గ్రామీణ నీటి సరఫరా సంస్థ అధికారులను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశించారు. నెల్లూరు నగరం మాగుంట లే అవుట్ లోని విపిఆర్ గారి నివాసంలో కోవూరు నియోజకవర్గ పరిధిలోని RWS అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ హ్యాండ్ బోర్లు, బోర్ వెల్స్ సమస్యలు ఎక్కడైనా వుంటే పంచాయతి సర్పంచులతో మాట్లాడి త్వరతగతిన పరిష్కారం అయ్యేలా చూడాలని కోరారు. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులకు సంబంధించిన మోటార్ల రిపేర్లు ఏవైనా వుంటే త్వరగా చేయించడంతో పాటు ప్రత్యామ్నాయంగా అదనపు మోటారును కూడా అందుబాటులో వుంచుకోవాలని సూచించారు. వేసవిలోప్రభుత్వం నుంచి వచ్చే కంటింజెన్సీ గ్రాంట్స్ ను స్థానిక అవసరాలను పరిగణలోనికి తీసుకొని ప్రణాళిక బద్ధంగా వినియోగించాలన్నరు. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ క్లీనింగ్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఫిర్యాదులు
వస్తున్న నేపథ్యంలో స్థానిక సర్పంచులు, పంచాయతి కార్యదర్శులతో సమన్వయం చేసుకుంటూ గ్రామాలలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకర్స్ ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేయాలని ఆదేశించారు. తాత్కాలిక ప్రాతిపదికన ట్యాంకర్స్ ద్వారా తాగునీటి సరఫరా చేస్తున్న కొన్ని గ్రామాలకు పైప్ లైన్స్ ద్వారా నీరు సరఫరా చేసే శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. కోవూరు నియోజకవర్గ పరిధిలో వేసవికాలంలో ఎక్కడ తాగునీటి సమస్య తలెత్తినా 24 గంటలలో పరిష్కారం అయ్యేలా అప్రమత్తంగా వుండాలన్నారు. RWS అధికారులు, పంచాయతి కార్యదర్శులు, సర్పంచులతో వాట్సఫ్ గ్రూప్ క్రియేట్ చేసుకొని ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలకు అందుబాటులో వుండాలని కోరారు. సురక్షిత తాగునీటి సరఫరాలో సమస్యలేవైనా వుంటే తన దృష్టికి తేవాలని జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ సమీక్షా సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా సంస్థ డి ఇ శ్రీనివాసులు రెడ్డితో పాటు నియోజకవర్గ పరిధిలోని 5 మండలాల ఎ ఇ లు, పెన్నా డెల్టా ఛైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, టిడిపి నాయకులు బెజవాడ వంశీకృష్ణా రెడ్డి, ఇందుకూరుపేట, బుచ్చి, కోవూరు మండలాల టిడిపి అధ్యక్షులు రావెళ్ల వీరేంద్ర నాయుడు, బత్తుల హరికృష్ణ, ఇంతా మల్లారెడ్డి, అడపాల శ్రీధర్ రెడ్డి, మదన్ మోహన్ రెడ్డి మరియు జనసేన నేత చప్పిడి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.