*231 కోట్ల ఉపాధి హామీ పథకం పెండింగ్ బిల్లుల విడుదలకు మార్గం సుగమం, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి తో ఇదివరకే 100 కోట్లు విడుదల… కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులపై హర్షం…*

*ఎమ్మెల్సీ, ఉపాధి హామీ పెండింగ్ నిధుల సాధన కమిటీ సమన్వయకర్త – బీద రవిచంద్ర*

ఉపాధి నిధుల సాధనలో సహకరించిన సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి బీద ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నరేగా కమిటీ సభ్యులు గురుమూర్తి,సుభాషిణి, కీ.శే. పేరయ్య కృషిని ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు.

2014-19 మధ్యకాలంకి సంబంధించి ఉపాధి హామీ పథకం పెండింగ్ బకాయిల విడుదలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం శుభ పరిణామం.

టిడిపి ప్రభుత్వ హయాంలో(2014-19) చేపట్టిన ఉపాధి హామీ పథకం పనుల బిల్లులు మంజూరు కాకుండా తదనంతరం వచ్చిన వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా నిలిపివేసింది.

ఎటువంటి కోర్టు కేసులు, విజిలెన్స్ ఎంక్వయిరీలు లేకుండా 331 కోట్ల రూపాయల పెండింగ్ నిధులు విడుదల చేయాలని కూటమి ప్రభుత్వం గత మంత్రిమండలి లో ఆమోదం తెలిపింది.

231 కోట్ల రూపాయలు విడుదలకు అవకాశం లేకుండా గత ప్రభుత్వం కుట్ర పన్ని అడ్డుకోవడంతో కూటమి ప్రభుత్వం తొలి దశలో 100 కోట్లు మాత్రమే విడుదల చేసింది.

నాడు హైకోర్టును ఆశ్రయించి, బిల్లుల మంజూరు కు అనుకూల తీర్పు తెచ్చుకున్నా, నాటి వైసిపి ప్రభుత్వం కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపి అడ్డుకుంది.

నాటి వైసీపీ ప్రభుత్వ వికృత చర్యల వల్ల ఉపాధి హామీ పనులు చేపట్టిన వేలాదిమంది అప్పుల ఊబిలో కూలిపోయారు, మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ పథకం బకాయిలపై దృష్టి సారించి నిధుల విడుదలకు ప్రయత్నం చేయగా అప్పటికే క్లోజ్డ్ లో ఉన్న 4,22,633 పనులలో 3,52,788 పనుల బిల్లుల విడుదలకు కేంద్రం సమ్మతించింది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బిల్లుల మంజూరు కొరకు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూ ఇప్పటికి అనుమతులు పొందగలిగాం.

రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తుల మేరకు కొన్ని రోజుల క్రితం ఆన్ గోయింగ్ లో ఉన్న పనులకు 100 కోట్ల పెండింగ్ ఉపాధి నిధులను విడుదల చేసింది. క్లోజ్డ్ లో ఉన్న పనులకు మరి కొన్ని రోజుల్లోమరో 231 కోట్ల నిధులు విడుదల కానున్నాయి.

కేంద్ర ప్రభుత్వ నిధులకు మ్యాచింగ్ గ్రాంటు గా ఇవ్వాల్సిన 221 కోట్ల నిధులను త్వరలో విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో సాధించిన ఈ నిధుల మంజూరు విజయంతో “కక్ష సాధింపు చర్యలు” ఎల్లకాలం సాగవని మరోసారి రుజువైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *