పత్రికా ప్రకటన
25/01/2025

2011 జనాభా గణన డేటాలోని లోపాలు ఉండటం వల్ల ఆయుష్మాన్ భారత్ పథకంపై ప్రభావం

ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం నిర్వీర్యం అవుతోందని ఆవేదన – బిజెపి జిల్లా కార్యదర్శి చిలకా ప్రవీణ్

2011 జనాభా గణన డేటాలోని లోపాల ఆయుష్మాన్ భారత్ పథకం అమలులో సమస్యలు తలెత్తుతున్నాయని బిజెపి జిల్లా కార్యదర్శి చిలకా ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు .2011 జనాభా గణన డేటా ఆధార్ కి లింక్ ఇవ్వడం వల్ల చాలామందికి ఈ కేవైసీ చేయకపోవడం, పలువురి పేర్లు లేకపోవడం, పేరు, లింగం తప్పులు ఉండటం వల్ల ఆయుష్మాన్ భారత్ కార్డుల జారీలో ఆలస్యం అవుతోందనీ, ముఖ్యంగా 70 సంవత్సరాల వయస్సు లోపు వృద్ధులు ఈ సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు.2011 జనాభా గణన డేటాలో లేనివాళ్లు అవగాహన లేక ABHA కార్డు తీసుకొని వెళ్లి ఇతర రాష్ట్రాల నుండి తిరిగి వస్తున్నారు. ఈ సమస్య కారణంగా ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం నిర్వీర్యం అవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఆమోదించిన ఆయుష్మాన్ భారత్ కార్డులు కూడా ఇంకా లబ్ధిదారుల చేతికి చేరకపోవడం మరో ప్రధాన సమస్యగా ఉందని, చాలా మంది ప్రజలు తమ పేర్లు ఆమోదితమైనప్పటికీ, కార్డులు అందకపోవడం వల్ల పథకం ద్వారా అందే ఆరోగ్య సేవలకు దూరమవుతున్నారు.

2011 జనాభా గణన డేటాను తిరిగి రీసర్వే చేసి సరిచేయాలనీ,కొత్త వారిని జనాభాగణనడేటాలోచేర్చాలనీ,ఆయుష్మాన్ భారత్ పథకం అమలును సులభతరం చేయాలనీ సంబంధిత అధికారులను కోరుతున్నన్నారు .ABHA కార్డు మరియు AB-PMJAY కార్డుల మధ్య ఉన్న వ్యత్యాసం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి.ఆయుష్మాన్ భారత్ పథకం లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను అందరికీ అందించాలంటే డేటానుసరిచేయడం అత్యవసరం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed