
*2002 ఓటర్ లిస్ట్ ప్రకారము ఉన్న పేర్లను ఇంటింటి సర్వే నిర్వహించి మ్యాపింగ్ పూర్తి చేయవలసిందిగా ఆదేశించిన కమిషనర్ వై ఓ నందన్*
117 నెల్లూరు సిటీ నియోజకవర్గ ఈ.ఆర్.ఓ. వై.ఓ నందన్ నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో గురువారం ఎన్నికల సూపర్వైజర్లు, బూత్ లెవెల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షలో భాగంగా బూత్ లెవెల్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికల సంఘం, జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) లో భాగంగా బూత్ లెవెల్ అధికారులు వారి పోలింగ్ బూత్ ఇంటింటి సర్వే లో భాగంగా మ్యాపింగు, ప్రోజెనీ కచ్చితత్వంగా నిర్వహించాలని ఆదేశించారు.
2002 ఓటర్ లిస్ట్ ప్రకారము ఉన్న పేర్లను ఇంటింటి సర్వే నిర్వహించి మ్యాపింగ్ పూర్తి చేయవలసిందిగా ఆదేశించారు. ఇప్పటివరకు నిర్వహించిన సర్వేలలో మంచి పురోగతి సాధించిన బూత్ లెవెల్ అధికారులు నుంచి సలహాలు తీసుకొని సర్వేను వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఏ.ఈ.ఆర్.ఓ షఫీ మాలిక్, ఎలక్షన్ డిప్యూటీ తాసిల్దార్ ఆనందరావు, సూపరింటెండెంట్ పద్మావతి, సూపర్వైజర్లు, బూత్ లెవెల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.