*144 ఏళ్లకోకసారి మహా కుంభమేళా ప్రయాగ్‌రాజ్‌లో మాత్రమే జరుగుతుందనీ మరెక్కడా జరగదని మీకు తెలుసా..?*

హిందూ సంప్రదాయంలో కుంభమేళాకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మేళాలో పుణ్యస్నానం చేస్తే ఇప్పటి వరకు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి మోక్షం కలుగుతుందని భక్తులు నమ్ముతుంటారు

2025 జనవరి 13 తేది నుంచి మొదలయ్యి ఫిబ్రవరి 26 తేది వరకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగే ఈ మహా కుంభమేళా జరగనుంది. 144 ఏళ్లకోకసారి మహా కుంభమేళా ప్రయాగ్‌రాజ్‌లో మాత్రమే జరుగుతుంది

ఇది అత్యంత పవిత్రమైన సమయంగా పండితులు చెబుతుంటారు. ఎంతో కన్నుల పండుగగా జరిగే ఈ మేళా ఉత్సవం ప్రపంచవ్యాప్తంగా హిందువులను ఏకం చేస్తుంది. అయితే ఏయే రోజున పుణ్యస్నానాలు జరుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

మహాకుంభ్ 2025 🔱🚩

జనవరి 13 నుండి ఫిబ్రవరి 26, 2025 మధ్య మహా కుంభ్ 2025 సంబరాలు.

📍 ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్), ఉత్తర ప్రదేశ్.

ప్రాముఖ్యత: ఆధ్యాత్మిక ప్రక్షాళన, సమాజ ఐక్యత, భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం చాటే అతి గొప్ప వేడుక.

ప్రధాన స్నాన తేదీలు:

పౌష్ పూర్ణిమ: జనవరి 13, 2025
మకర సంక్రాంతి: జనవరి 14, 2025
మౌని అమావాస్య: జనవరి 29, 2025
వసంత పంచమి: ఫిబ్రవరి 3, 2025
మాఘ పూర్ణిమ: ఫిబ్రవరి 12, 2025
మహా శివరాత్రి: ఫిబ్రవరి 26, 2025

ఈ తేదీలు భక్తులకు చాలా ముఖ్యమైనవి, ఈ పవిత్రమైన రోజులలో అక్కడ స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోయి ఆధ్యాత్మిక ప్రయోజనాలు లభిస్తాయని ప్రజలు నమ్ముతారు.

మొదటి పుణ్యస్నానం జనవరి 13న మకర సంక్రాంతి రోజున జరగబోతుంది.

రెండో పుణ్యస్నానం జనవరి 29న మౌనీ అమావాస్య రోజున రోజున జరగబోతుంది.

మూడో పుణ్యస్నానం ఫిబ్రవరి 3న వసంత పంచమి రోజున జరగనుంది.

ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున అంతిమ పుణ్యస్నానం జరగబోతుంది.

కుంభమేళా జరిగే రోజుల్లో వందలాది మంది భక్తులు వారి పాపాల నుంచి పుణ్య స్నానాలు చేసి విముక్తి పొందుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *