*144 ఏళ్లకోకసారి మహా కుంభమేళా ప్రయాగ్రాజ్లో మాత్రమే జరుగుతుందనీ మరెక్కడా జరగదని మీకు తెలుసా..?*
హిందూ సంప్రదాయంలో కుంభమేళాకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మేళాలో పుణ్యస్నానం చేస్తే ఇప్పటి వరకు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి మోక్షం కలుగుతుందని భక్తులు నమ్ముతుంటారు
2025 జనవరి 13 తేది నుంచి మొదలయ్యి ఫిబ్రవరి 26 తేది వరకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగే ఈ మహా కుంభమేళా జరగనుంది. 144 ఏళ్లకోకసారి మహా కుంభమేళా ప్రయాగ్రాజ్లో మాత్రమే జరుగుతుంది
ఇది అత్యంత పవిత్రమైన సమయంగా పండితులు చెబుతుంటారు. ఎంతో కన్నుల పండుగగా జరిగే ఈ మేళా ఉత్సవం ప్రపంచవ్యాప్తంగా హిందువులను ఏకం చేస్తుంది. అయితే ఏయే రోజున పుణ్యస్నానాలు జరుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..
రెండో పుణ్యస్నానం జనవరి 29న మౌనీ అమావాస్య రోజున రోజున జరగబోతుంది.
మూడో పుణ్యస్నానం ఫిబ్రవరి 3న వసంత పంచమి రోజున జరగనుంది.
ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున అంతిమ పుణ్యస్నానం జరగబోతుంది.
కుంభమేళా జరిగే రోజుల్లో వందలాది మంది భక్తులు వారి పాపాల నుంచి పుణ్య స్నానాలు చేసి విముక్తి పొందుతారు.