*14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే పథకం ఒకటైన ఉందా — వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల*
*ప్రజలకు మంచి చేసే వారిని ఆదరించండి — ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల*
*చదువుకున్న వారు ముందుకు వచ్చి విజ్ఞతతో ఓటు వేయండి — ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల*
*19వ డివిజన్లో కె.వి.ఆర్ శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం*
40 సంవత్సరాల రాజకీయ చరిత్ర, 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పని చేసిన నారా చంద్రబాబు నాయుడు పేరు చెబితే ఎప్పటికీ గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క పథకమైన ఉందా అని…?? నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఆదివారం ఉదయం 19వ డివిజన్ లెక్చర్స్ కాలనీలో పార్టీ సీనియర్ నాయకులు కె.వి.ఆర్ శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆత్మీయ సమావేశానికి హాజరైన స్థానిక ప్రజలను ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో నివసించేవారు చదువుకున్న చాలా తెలివి కలిగిన వారని వారందరూ విజ్ఞతతో ఒకసారి ఆలోచించి నేటి రోజుల్లో ప్రజలకు ఎవరు మేలు చేస్తున్నారు…అని గమనించి ఓటు వేసేందుకు ముందుకు రావాలని కోరారు. చదువుకున్న వారు ముఖ్యంగా పేద ప్రజలకు ఎవరైతే మేలు చేస్తున్నారో అని ఆలోచించి అటువంటి మంచి వ్యక్తులకు మద్దత్తు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే అభ్యర్థి అధన ప్రభాకర్ రెడ్డి సూచించారు. సమాజంలో అన్ని విషయాలు తెలిసినవారితో ప్రత్యేకంగా సమావేశం కావడం, వారితో అనేక విషయాలు మనసేపి మాట్లాడుకోవడం చాలా సంతోషంగా ఉందని ఈ సమావేశమంను ఏర్పాటు చేసిన కె.వి.ఆర్ శ్రీనివాసులు రెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన నెల్లూరు వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి స్థానిక వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు ఘనంగా సత్కరించారు. ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పలువురు స్థానికలు మాట్లాడుతూ ప్రజా సంక్షేమాన్ని కోరుకునే మీలాంటి మంచి వ్యక్తులకు మా మద్దత్తు ఎప్పుడు ఉంటుందని తెలియజేశారు. ఈ ఆత్మీయ సమావేశంకు 19వ డివిజన్ వైసీపీ ముఖ్య నాయకులు కొండేటి శివారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ పోట్లూరు స్రవంతి, స్థానిక డివిజన్ ఇన్చార్జీలు పచ్చ రవి, వారాల లక్ష్మీనారాయణ, జల్లి కుమార్, పార్టీ నాయకులు పుట్టా విజయకుమార్ రెడ్డి, దేవుళ్ళ స్వరూప్ రెడ్డి, కొండేటి రఘురామిరెడ్డి, కే. సుకుమార్ రెడ్డి, నెల్లూరు శ్రీనివాసులు నాయుడు, సుధాకర్ రెడ్డి, వంశీ, మాజీ కార్పొరేటర్ అనిత, నారు రమణారెడ్డి, సిహెచ్ సూరిబాబు జిల్లా అధికార ప్రతినిధి లంక రామశి వారెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు మల్లు సుధాకర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి తదితరుల తోపాటు స్థానిక వైస్సార్సీపీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.