
*117 నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఎలక్షన్ సిబ్బందితో సమీక్ష నిర్వహించిన కమిషనర్ వై. ఓ.నందన్*
నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ 117 నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఎలక్షన్ సిబ్బందితో కమాండ్ కంట్రోల్ సెంటర్ నందు మంగళవారం సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షా సమావేశంలో సిటీ నియోజకవర్గంలోని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కు సంబంధించి ఓటర్లను మ్యాపింగ్ చేయు ప్రక్రియలో భాగంగా బూత్ లెవెల్ అధికారులు, సూపర్వైజర్ల పరిధిలోని పురోగతిపై సూపర్వైజర్ వారీగా సమీక్షించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి బూత్ లెవల్ అధికారి ఇంటి ఇంటి సర్వే నిర్వహించి మ్యాపింగ్ నిర్వహించాలని, కొంతమంది బూత్ లెవల్ అధికారులు మ్యాపింగ్ పనిని సరిగా నిర్వహిస్తున్నారని, కొంతమంది మ్యాపింగ్ విషయంలో అశ్రద్ధ కనపరుస్తున్నారని సూచించారు.
మ్యాపింగ్ బాగా నిర్వహించిన బూత్ లెవెల్ అధికారుల చేత వారు చేసిన విధానాన్ని విధానాన్ని అందరికీ అర్థమయ్యేలా అవగాహన కల్పించారు. అలాగే తక్కువ శాతం పూర్తి చేసిన బి.ఎల్.ఓ లను, సూపర్వైజర్ లు ప్రతిరోజు విధిగా పర్యవేక్షించాలని ఈ సందర్భంగా ఆదేశించారు.
ఈ సమావేశంలో సిటీ ప్లానర్ హిమబిందు, అర్బన్ తహసిల్దార్ షఫీ మాలిక్, ఎలక్షన్ డిప్యూటీ తాసిల్దార్ ఆనంద్, సూపరింటెండెంట్ పద్మావతి, సూపర్వైజర్లు, బూత్ లెవెల్ ఆఫీసర్ లు, సిబ్బంది పాల్గొన్నారు.