
10వ రెవెన్యూ క్రీడా సాంస్కృతిక మహోత్సవాల నిర్వహణకు ఎంపీ ఆర్థిక సహాయం
– 11 లక్షలు అందించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
–
– ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన జిల్లా రెవెన్యూ ఉద్యోగులు
నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. నెల్లూరు జిల్లాలో 10వ రెవెన్యూ క్రీడా సాంస్కృతిక ఉత్సవాల నిర్వహణ కొరకు 11 లక్షల ఆర్థిక సహాయం చేశారు. ఈ మేరకు శుక్రవారం నెల్లూరులోని తన నివాసంలో అసోసియేషన్ సభ్యులకు చెక్కును అందించారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శ్రీయుత జిల్లా కలెక్టర్ శ్రీ ఓ ఆనంద్ IAS వారు ఈ నెల 11, 12, 13 తేదీల్లో నెల్లూరు నగరంలోని ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో 10 వ జిల్లా రెవెన్యూ క్రీడా సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించుటకు అనుమతిచ్చారు.
జిల్లా రెవిన్యూ క్రీడా సాంస్కృతిక ఉత్సవాలలో పాల్గొనే జిల్లాలోని రెవెన్యూ క్రీడాకారులకు కొన్ని సంవత్సరాలుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు.. VPR ఫౌండేషన్ తరపున క్రీడా దుస్తులను అందజేస్తున్నారు. గతంలో 2018 లో జరిగిన జిల్లా రెవెన్యూ క్రీడాల్లోనూ మరియు 2022లో జరిగిన జిల్లా రెవెన్యూ క్రీడల్లోనూ VPR ట్రస్ట్ తరపునే దుస్తులను అందించి రెవెన్యూ ఉద్యోగుల క్రీడాలకు ప్రాధాన్యతను ఇచ్చి ప్రోత్సహించారు. ప్రస్తుతం కూడా పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని రెవెన్యూ శాఖ తరపున కలవగా వారు సానుకూలంగా స్పందించి జిల్లాలోని రెవెన్యూ క్రీడాకారులకు క్రీడా దుస్తులను అందజేయుటకు అంగీకరించి, జిల్లా రెవెన్యూ క్రీడల నిర్వహణకు 11 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా రెవెన్యూ క్రీడా నిర్వహణకు ఆర్థిక సహాయం చేసిన పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జిల్లాలోని అందరు రెవిన్యూ ఉద్యోగుల పక్షాన ధన్యవాదాలు తెలియపరిచారు.
కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ జే. ఉదయ భాస్కర్ , తెలుగు గంగ ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ శ్రీ డి హుస్సేన్ సాహెబ్ గారు మరియు రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా రిటైర్డ్ రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.