
01.01.1985 నుండి 31.08.2025 లోపు అనుమతి పొందిన ప్లానుకు విరుద్ధముగా నిర్మించిన భవనముల క్రమబద్ధీకరణ కొరకు BPS-2025 పథకమును ప్రవేశపెట్టనున్నట్లు తెలియపరిచియున్నారు.
తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము వారు, పుర పరిపాలన శాఖ మెమో. నెం. 3014209/M2/2025, ໖໖: 27.10.2025 5, ໖:01.01.1985 2 31.08.2025 ໖ అనుమతి పొందిన ప్లానుకు విరుద్ధముగా నిర్మించిన భవనముల క్రమబద్ధీకరణ కొరకు BPS-2025 పథకమును ప్రవేశపెట్టనున్నట్లు తెలియపరిచియున్నారు.
మరియు తేదీ:31.08.2025 తరువాత నిర్మించిన అనధికార లేదా అనుమతి పొందిన ప్లానుకు విరుద్ధముగా నిర్మించిన భవనములు, BPS- 2025 పథకమునకు అనర్హమైనవని, అట్లు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనములను RTGS/GPS సాంకేతికత ద్వారా గుర్తించి, వాటి కూల్చివేతకు చట్టపరమైన చర్యలు తీసుకొనవలసినదిగా ఉత్తర్వులను జారీ చేసియున్నారు.
కావున నెల్లూరు పట్టణ భవన యజమానులకు తెలియజేయునది ఏమనగా, తేదీ: 31.08.2025 తరవాత అనధికారికముగా లేదా అనుమతి పొందిన ప్లానుకు విరుద్ధముగా భవన నిర్మాణములను చేపట్టవలదనియు, చేపట్టినచో, ప్రభుత్వము వారి ఉత్తర్వులనుసరించి సదరు భవనముల పైన చట్టపరమైన చర్యలు తీసుకొనబడునని తెలియచేయడమైనది.
అందులో భాగంగానే, నెల్లూరు నగరములోని పలు ప్రాంతాలలో తేదీ: 31.08.2025 తరువాత నిర్మించిన అనధికార లేదా అనుమతి పొందిన ప్లానుకు విరుద్ధముగా నిర్మించిన భవనముల కూల్చివేత ప్రక్రియ ఆరంభించడమైనది. వాటి వివరాలు,
1. NGO కాలనీ నందు మినీ బైపాస్ పక్కన గల భవనము నందు అనధికారికముగా 3 వ అంతస్తు నిర్మించుటకు ఏర్పాటు చేసిన షట్టరింగ్ ను తొలగించడం జరిగినది.
2. 41 వ వారు లోని పుట్టా ఎస్టేట్స్ నందు అనధికారికముగా భవనము నిర్మించుటకు ఏర్పాటు చేసిన షట్టరింగ్ ను తొలగించడం జరిగినది.
సిటీ ప్లానర్, నెల్లూరు నగరపాలక సంస్థ.