
*హిందూపురం వైసీపీ ఆఫీస్ దాడికి నిరసనగా.. నెల్లూరు విఆర్సి సెంటర్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలో..*ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.*
—————————–
నెల్లూరు VRC సెంటర్ లో *హిందూపురం వైసిపి ఆఫీస్ పై టిడిపి గుండాల దాడికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో* కలిసి.. వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు *కాకాణి గోవర్ధన్ రెడ్డి,* గారు వైఎస్ఆర్సిపి సిటీ ఇన్చార్జి *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి*, గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ *ఆనం విజయకుమార్ రెడ్డి,* గారు నిరసన కార్యక్రమం చేపట్టారు.
ముందుగా *నల్లరిబ్బన్లు ధరించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.*
అనంతరం *అంబేద్కర్ విగ్రహం ఎదుట.. వైసిపి ఆఫీస్ పై దాడికి సంబంధించిన.. చిత్రాలను ప్రదర్శిస్తూ.. నిరసన తెలియజేశారు.*
*కూటమి ప్రభుత్వ రెడ్ బుక్ పాలన నశించాలని కార్యకర్తలు నినాదాలు చేశారు.*
కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి.. ఈ రాష్ట్రంలో ప్రశ్నిస్తున్న వారిపై.. అక్రమ కేసులు బనాయించి.. జైల్లో పెట్టి హింసించడం లాంటి.. పనులు చేస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ టిడిపి నేతలు దుర్మార్గ పాలన సాగిస్తున్నారని జిల్లా అధ్యక్షులు *కాకాణి గోవర్ధన్ రెడ్డి* గారు మండిపడ్డారు.
నిన్నటి రోజున హిందూపురం వైసిపి ఆఫీస్ పై టిడిపి గుండాలు చేసిన దాడి.. తెలుగుదేశం పార్టీ పరాకాష్టకు నిదర్శనం అన్నారు.
ఈ సందర్భంగా *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు మాట్లాడుతూ..
• తెలుగుదేశం పార్టీ ఆకృత్యాలకు నిరసనగా.. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు విఆర్సి సెంటర్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సాక్షిగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు.
• గడిచిన ఒకటిన్నర సంవత్సరకాలం నుంచి.. ప్రశ్నిస్తున్న వారిపై.. తెలుగుదేశం పార్టీ.. దుర్మార్గంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు బనాయించడం జైల్లో పెట్టడం జరుగుతుందన్నారు.
• ఎవరైనా ప్రభుత్వంపై మాట్లాడితే.. వారి ఇల్లు ధ్వంసం చేయడం, వారి ఆఫీసులపై పడి విధ్వంసం సృష్టించడం లాంటి ఆకృత్యాలకు టిడిపి నేతలు తెగబడుతున్నారని అన్నారు.
• 2014 -19 కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా..బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇరిగేషన్ ల్యాండ్ లో అక్రమంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన నిర్మాణాన్ని తోలగిస్తే.. దానిపై ఐదేళ్లు టిడిపి నేతలు అదేదో అన్యాయం అన్నట్టుగా మాట్లాడారని అన్నారు.
• ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా.. ప్రభుత్వమే తొలి అడుగు వేయాలన్న ఆలోచనతో ఆరోజు.. జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
• ఈరోజు తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఆస్తుల విధ్వంసం, అక్రమ కేసులు బనాయించి వైసిపి నేతలను జైల్లో పెట్టడం చూస్తుంటే.. వారి అరాచకాల పరాకాష్ట ప్రజలకు ఇట్టే అర్థమవుతుందన్నారు.
• తెలుగుదేశం పార్టీ.. చేసిన మోసాలు.. ప్రజలందరికీ అర్థమై.. ఈరోజు వారంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తున్నారని అన్నారు.
• మళ్లీ ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన.. రావాలని ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారని అన్నారు.
• రాబోయే రోజుల్లో ప్రజల ఆకాంక్ష మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం తద్యమన్నారు.
• ఈరోజు కూటమి ప్రభుత్వంలో సాగుతున్న దుర్మార్గాలు అన్నిటికీ.. ఆరోజు టిడిపి నేతలు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.