*హాస్టల్ ప్రాంగణంలో క్రమం తప్పకుండా పారిశుధ్య నిర్వహణ పనులను చేపట్టేలా పర్యవేక్షించాలని సూచించిన కమిషనర్ వై ఓ నందన్*

 

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ బుధవారం స్థానిక దొడ్ల కౌసల్యమ్మ మహిళా జూనియర్ కళాశాల హాస్టల్ భవనాన్ని కళాశాల అధికారులతో కలిసి పరిశీలించారు.

కళాశాల ప్రాంగణంలోని హాస్టల్ భవనం, విద్యార్థినుల వసతి, తాగునీటి సదుపాయం, మరుగుదొడ్లు, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించి అధికారులకు వివిధ సూచనలు జారీ చేశారు.

హాస్టల్ ప్రాంగణంలో క్రమం తప్పకుండా పారిశుధ్య నిర్వహణ పనులను చేపట్టేలా పర్యవేక్షించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆర్.ఐ.ఓ టీ.వరప్రసాద్, కళాశాల ప్రిన్సిపల్ ఎమ్.వి రమణారెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *