“హర్ ఘర్ తిరంగా – హర్ ఘర్ స్వచ్ఛత” కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
– కమిషనర్ వై.ఓ నందన్
స్వతంత్ర్య కా ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన హర్ ఘర్ తిరంగా హర్ ఘర్ స్వచ్ఛత కార్యక్రమాన్ని నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో విజయవంతం చేద్దామని కమిషనర్ వై.ఓ నందన్ పిలుపునిచ్చారు.
కార్పొరేషన్ కార్యాలయం కమిషనర్ ఛాంబర్ లో కార్యక్రమానికి సంబంధించిన వివరాలను కమిషనర్ గురువారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర దినోత్సవ సంబరాలను ప్రజలందరిని మమేకం చేస్తూ స్వచ్ఛత కార్యక్రమాలతో జరుపుకుందామని సూచించారు. స్వతంత్ర మహోత్సవాలలో భాగంగా స్వచ్ఛత కే సంగ్ క్యాంపెయిన్ ను ఈనెల 8 నుంచి 15 వరకు నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహిస్తున్నామని, జాతీయత, పరిశుభ్రత, పౌర బాధ్యత వంటి అంశాలపై కార్యక్రమాలను రూపొందించి పౌరులందరికీ అవగాహన కల్పించనున్నామని తెలిపారు.
స్వతంత్ర ఉత్సవ సంబరాలలో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో పరిశుభ్రమైన వీధులను, స్వచ్ఛమైన తాగునీరు ప్రజలకు అందించి, స్వచ్ఛ నెల్లూరు సాకారం చేసేందుకు రూపొందించిన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కనకాద్రి, ఇంజనీరింగ్ విభాగం ఈ.ఈ రహంతు జానీ పాల్గొన్నారు.