*హనుమాన్ ర్యాలీ అడ్డుకోవడం మెడలో కాషాయ కండువాలును పట్టి లాగడం పోలీసుల లాఠీచార్జి హేయమైన చర్య:బిజెపి నేత మిడతల*
మదనపల్లిలో శనివారం నిర్వహించిన హనుమాన్ ర్యాలీలో *హిందూ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని అరెస్టులు చేశారు*.
అవసరం లేకుండా లాటిచార్జి చేసి హిందువుల ర్యాలీనీ అడ్డుకున్నారు.
హెల్మెట్లు ధరించి ర్యాలీ నిర్వహించాలనడం దేశ చరిత్రలోనే ఆశ్చర్యకరమైన పోలీసుల నిబంధన.
పోలీసులు ఆంక్షలు విధించిన మార్గానికి 3 కిలోమీటర్లముందు ర్యాలీని ఆపేసారు. *పోలీస్ ఆజ్ఞలను ఉల్లంఘించారని కేసు ఎలా పెట్టారో రాష్ట్ర హోంమంత్రి హిందువులకు జవాబు చెప్పాలనిరమేష్ డిమాండ్ చేశారు* మెడలో కాషాయ కండువాలు లాగేసి. మహిళల మీద దురుసుగా ప్రవర్తించడం భక్తులను లాఠీలతో తరుముకుంటూ పోవడం ఎవరి మెప్పుకోసం చేసినట్లో ఉందని,
హిందువులు ర్యాలీ ఎలా చేసుకోవాలో పోలీసులే నిర్దేశించడం హిందూ సమాజాన్ని అవహేళన చేస్తూ అవమానపర్చడమే ? హనుమాన్ ర్యాలీ పై మదనపల్లి *పోలీసుల వైఖరి హిందువుల మనోభావాలను దెబ్బతీయడం కాదా ఇందుకు హోంమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేసారు* ఇటువంటి సంఘటనలు చూస్తుంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు.