స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బిజెపి జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి

నెల్లూరు నగరంలోని , ములుముడి బస్టాండ్ వద్ద ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి బిజెపి జిల్లా అధ్యక్షులు సిపారెడ్డి వంశీధర్ రెడ్డి పూలమాలల తో నివాళులర్పించి, కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ యువతకు రోల్ మోడల్ మరియు స్ఫూర్తికి మూలమైన స్వామి వివేకానంద అని , యువతను దేశ భవిష్యత్తుగా చూశారనీ ,శారీరక, మానసిక, మరియు ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకోవాలని కోరారు.

జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సన్నపురెడ్డి సురేష్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ సంస్కృతిని, ఖ్యాతిని, విశిష్టతను అంతర్జాతీయ వేదికపై ప్రపంచానికి చాటిన ఆధ్యాత్మికవేత్త అని,గురువు పేరుతో మఠాలు, విద్యాలయాలు స్థాపించి ఎందరినో సమాజసేవకు అంకితంచేసిన తత్వవేత్త; తన ప్రసంగాలు, బోధనలతో యువతకు ప్రేరణగా నిలిచిన స్ఫూర్తిప్రదాత అన్నారు.

రాష్ట్ర సెల్స్ ఇన్చార్జి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, సుస్థిర భవిష్యత్తు కోసం బాధ్యత, దృఢచిత్తంతో దేశాన్ని నిర్మించడానికి యువత పునరంకితమవ్వాలని కోరారు..

బిజేపి జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్ సింగ్ కోటమిట్ట సెంటర్ నుండి ములుముడి బస్టాండ్ వరకు సుమారు 100 మంది యువతతో ర్యాలీగా వచ్చి వివేకానంద విగ్రహానికి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం విజయకుమార్, జిల్లా కార్యదర్శి చిలకా ప్రవీణ్ కుమార్, ఓబీసీ జోనల్ ఇంచార్జ్ ముక్కు రాధాకృష్ణ గౌడ్, రంగరాజన్,జగన్, మదన్ సాయి రెడ్డి, ప్రసాద్, అవినాష్, కిరణ్ ,సుబ్బారావు, మెంటా రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *