స్వర్ణ లింగేశ్వరుడికి శివరాత్రి ఉత్సవాలు

— గోడపత్రిక ఆవిష్కరణ

నెల్లూరు నగరంలోని స్థానిక మూలపేట నెల్లూరు చెరువు గణేష్ ఘాట్ వద్దనున్న శ్రీ స్వర్ణ లింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందుమహా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా స్వర్ణ భారత్ ట్రస్ట్ విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి సింహపురి కార్తిక దీపోత్సవ సమితి ఘనంగా ఆధ్వర్యంలో జరుగుతాయని విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు పిట్టి సత్య నాగేశ్వరరావు కార్యదర్శి పీ సురేందర్ రెడ్డి ముక్కాల వ్యాస్ ప్రసాద్ సింహపురి కార్తిక దీపోత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భయ్యా మల్లిక, కొడూరు జయప్రద పేర్కొన్నారు గురువారం రుణ లింగేశ్వర స్వామి దేవస్థానం నందు జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం నుంచి మూడు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం ఫిబ్రవరి 25వ తేదీన త్రయోదశి ప్రదోష వేళ నందీశ్వర స్వామి వారికి శ్రీ స్వరలింగేశ్వర స్వామి వారికి ప్రదోష భిషేకములు అంకురార్పణ, అగ్ని ప్రతిష్ట కుంభ స్థాపన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఫిబ్రవరి 26వ తేదీనబుధవారం శివరాత్రి రోజు ఉదయం పలు పుణ్య నది జల తీర్థాలు కుంభమేళా జల తీర్థాలతో శ్రీ స్వర్ణ లింగేశ్వర స్వామివారికి భక్తుల స్వహస్తాలతో అభిషేక కార్యక్రమం మరియు 108 లీటర్ల చెరుకు రసంతో అభిషేక కార్యక్రమం విశేష పూజలు వేద పండితులచే రుద్ర హోమం జరుగుతుందన్నారు. మహా శివరాత్రి వేళ లింగోద్భవ అభిషేకములు, శివరాత్రి జాగరణ కార్యక్రమం సాంస్కృతిక భజనలు కోలాటాలు భక్తి గీతాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొంటూ, ఈ కార్యక్రమానికి స్వర్ణ భారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ శ్రీమతి దీప వెంకట్, పార్లమెంటు సభ్యులు వేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు, రూరల్ శాసనసభ్యులు కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి దంపతులు, మరియు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.
గురువారం ఉదయం శ్రీ స్వర్ణ లింగేశ్వర స్వామి వారికి 108 కిలోల భస్మంతో భస్మాభిషేకం మహా పూర్ణాహుతి కుంభ ప్రోక్షణ కార్యక్రమాలు జరుగుతాయని సాయంత్రం 6 గంటలకు శ్రీ శివపార్వతుల తిరు కళ్యాణ మహోత్సవం ఈ కార్యక్రమంలో కామేశ్వరరావు, వెంకటేశ్వర్లు, సుజాత, మహాలక్ష్మి, శ్రీనివాసులు, హర్షవర్ధన్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed