స్వర్ణ భారతి ట్రస్ట్ ఆవరణంలో జరిగిన వివాహ రిసెప్షన్ వేడుకలలో మాజీ ఎంపీ ఆదాల
మాజీ రాష్ట్రపతి యం వెంకయ్య నాయుడుగారి మనుమడు వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి *మాజీ పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డిగారు* హాజరయ్యారు. ఆదివారం వెంకటాచలం స్వర్ణ భారతి ట్రస్ట్ ఆవరణంలో జరిగిన వివాహ రిసెప్షన్ వేడుకలలో మాజీ ఎంపీ ఆదాల పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మాజీ పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డిగారు మాజీ ఉపరాష్ట్రపతి యం వెంకయ్య నాయుడుగారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు విజయ డెయిరీ చైర్మన్ కొండ్రేడ్డి రంగారెడ్డి, వైస్సార్సీపీ నాయకులు స్వర్ణ వెంకయ్య, పాశం శ్రీనివాస్, సీహెచ్ హరిబాబు యాదవ్, జడ్పీటీసీ సభ్యులు మల్లు సుధాకర్ రెడ్డి, కొండేటి నరసింహరావు, అల్లాబక్షు, ముత్తంగి రామయ్య, మొయింద్ధిన్, బెల్లంకొండ వెంకయ్య, నాని తదితరులు ఉన్నారు.