*స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ఏర్పాట్లను పర్యవేక్షించిన స్పెషల్ ఆఫీసర్ యం.సూర్య తేజ ఐ.ఏ.ఎస్.,*
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతి నెలా మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ లో భాగంగా కందుకూరు నియోజకవర్గం పరిధిలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ఏర్పాట్లను కందుకూరు మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ అయిన శ్రీ. యం.సూర్య తేజ ఐ.ఏ.ఎస్., సోమవారం స్వచ్చాంద్ర చైర్మన్ శ్రీ. పట్టాభిరాం, కందుకూరు శాసనసభ్యులు శ్రీ. ఇంటూరి నాగేశ్వరరావు, కందుకూరు సబ్ కలెక్టర్, కలిసి డంపింగ్ యార్డును పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలో పలు కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లలో భాగంగా శానిటేషన్ పనులు, సివిల్ వర్క్స్, జంగల్ క్లియరెన్స్, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.
అదేవిధంగా స్థానిక టిడ్కో గృహ సముదాయాల ప్రాంగణాలలో మౌలిక వసతులను కల్పించి లబ్ధిదారులకు గృహాలను అందజేసే కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీ పూజిత, కమిషనర్ అనూష లు పాల్గొన్నారు.
.