*స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేద్దాం— ముక్కు రాధాకృష్ణ గౌడ్ బీజేపీ OBC మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు.*

భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ముక్కు రాధాకృష్ణ గౌడ్ ని నెల్లూరు నగరంలోని ఆదిత్య నగర్ లోని ఆయన నివాసంలో జనసేన రాష్ట్ర నాయకులు పర్శి గాని మల్లికార్జున గౌడ్, మరియు యువ వ్యాపార వేత్తలు ఆధ్వర్యంలో కలిసి శాలువాలతో సత్కరించి స్వీట్స్ పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ముక్కు రాధాకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీల కూటమి గత ఎన్నికల్లో ఘన విజయం సాధించడం సంతోషించదగ్గ విషయమని అలాగే మూడు పార్టీల కలయికకు జనసేన అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ఏర్పడిందని ఆయన వంతుగా ఏర్పాటుకు గట్టి ప్రయత్నాలు చేయడం జరిగిందని అలాగే ఎన్నికల ప్రచారంలో సైతం పెద్ద ఎత్తున రాష్ట్రమంతా తిరిగి ప్రజలను చైతన్యవంతులను చేసి కూటమికి ఘన విజయాన్ని చేకూర్చడం జరిగిందని అలాగే రాబోవు స్థానిక సంస్థలు ఎన్నికల్లో కూడా మూడు పార్టీలు కూటమి కలిసికట్టుగా పనిచేసే స్థానిక సంస్థల్లో సైతం ఘన విజయాన్ని సాధించి పెట్టాలని స్థానికంగా ఉన్న మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు అన్ని వర్గాల ప్రజలతో సన్నిహితంగా మెలిగి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్నిటిని అర్హులైన ప్రతి పేదవాడికి అందే విధంగా పనిచేయాలని తద్వారా కూటమి యొక్క బలాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధిని సాధించే దిశగా పనిచేస్తుంది అని అన్నారు. పై కార్యక్రమంలో జనసేన రాష్ట్ర నాయకులు పర్శి గాని మల్లికార్జున గౌడ్ , నేలపాటి నాఘ భీమేశ్వరరావు, ఉదయగిరి కృష్ణమోహన్ గౌడ్, కుడుముల హరి క్రిష్ణ గౌడ్, పర్శి గాని దామోదర్ గౌడ్, గాజుల సోమశేఖర్, వెంపులూరు ప్రదీప్ గౌడ్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *