*స్త్రీలు, వితంతువులకు విద్య అందించేందుకు, తద్వారా వారిలో చైతన్యం నింపేందుకు శ్రమించిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే*

*అంబేద్కర్ గారి నోట గురువుగా పిలవబడిన సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే*

*ఏపీ శాసనమండలి సభ్యులు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్*

 

 

*దేశంలో ఏ ఉద్యమం గురించి మాట్లాడుకున్నా తొలిగా గుర్తుకొచ్చే ఉద్యమకారుడు జ్యోతిరావు పూలే.*

*పీడిత, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా పనిచేసిన సామాజిక చైతన్యకర్త జ్యోతిరావు పూలే*

*మొట్టమొదటిసారి “మహాత్మా” అన్న బిరుదును పొందిన మహనీయుడు జ్యోతిరావు పూలే*

*అంబేద్కర్ గారి నోట గురువుగా పిలవబడిన సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే*
*
*స్త్రీలు, వితంతువులకు విద్య అందించేందుకు, తద్వారా వారిలో చైతన్యం నింపేందుకు శ్రమించిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే*

తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ నందు జరిగిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, టీటీడీపి రాష్ట్ర నాయకులు రాజు నాయక్ లతో కలిసి *ఏపీ శాసనమండలి సభ్యులు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.*

అనంతరం పూలే గారి చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వారు చేసిన సేవలను గుర్తు తెచ్చుకున్నారు.

*ఈ సందర్భం గా బీద మాట్లాడుతూ……*

స్వాతంత్రం రాక మునుపే సమాజంలోని పీడిత, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన వ్యక్తి జ్యోతిరావు పూలే.

మహిళలు, వితంతువులకు విద్య, వైద్యం అందుబాటులో ఉండాలని, వారికి సమాన హక్కులు కావాలని పోరాడిన మహనీయులు జ్యోతిరావు పూలే.

మరో రెండేళ్లలో 75 వ స్వాతంత్ర్య వేడుకలకు దేశం సిద్ధమవుతున్నా విద్య, ఉపాధి, రిజర్వేషన్ ఉద్యమాలు సాగుతూనే ఉన్నాయి. కానీ వందేళ్ళ క్రితమే వాటిపై పోరాడిన ఘనత జ్యోతిరావు పూలే దే.

అట్టడుగు వర్గాలకు విద్యలో, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించినప్పుడే వారిలో చైతన్యం నిండి, ఉపాధి అవకాశాలు పొందుతారని పూలే తలిచారు.

ఉత్తర భారతంలోనే కాదు, తమిళనాడులో సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యానికి నాంది పలికిన వివి నాయకర్ తో కలిసి ఉద్యమాలకు శ్రీకారం చుట్టిన ఆదర్శనీయుడు పూలే.

మహాత్మ జ్యోతిరావు పూలే, అంబేద్కర్ గారి స్ఫూర్తితో 43 సంవత్సరాల క్రితం ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు.

వారి మహోన్నత ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు శ్రమిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వెనుకబడిన వర్గాలకు అండగా నిలుస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed