*స్ట్రెవ్ పథకం ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు? అని లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ వేమిరెడ్డి*
– లోక్ సభలో ఎంపీ వేమిరెడ్డి ప్రశ్న
కేంద్ర ప్రభుత్వం Skills Strengthening for Value Enhancement (STLEKRIVE) ప్రాజెక్టు కింద అందుతున్న సదుపాయాలు ఏంటని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు లోక్‌సభలో సోమవారం ఆరా తీశారు. STRIVE ప్రాజెక్టు కింద నెల్లూరులో రెండు ప్రభుత్వ ITIలు, తడలో ఒక ప్రభుత్వ ITI లో నైపుణ్యాలను బలోపేతం చేయడం, లెర్నింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు, వసతుల కల్పనను అందించడానికి ఎంపిక చేశారన్నది వాస్తవమేనా అని ప్రశ్నించారు. వీటికి కేటాయించిన, మంజూరు చేసిన, విడుదల చేసిన, ఖర్చు చేసిన నిధుల వివరాలు ఆరా తీశారు. అలాగే ఇతర ఐటీఐలను ఈ ప్రాజెక్టు కిందను తీసుకువచ్చేందుకు కేంద్రం కృషి చేస్తోందా అని అడిగారు.
ఎంపీ వేమిరెడ్డి ప్రశ్నలకు కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. STRIVE ప్రాజెక్టు కింద దేశవ్యాప్తంగా మొత్తం 500 ITIలు (వీటిలో 467 ప్రభుత్వ, 33 ప్రైవేట్ ITIలు ఉన్నాయి) ఎంపిక చేయబడ్డాయన్నారు. ఈ ఐటీఐలను ప్రపంచ బ్యాంకు సహాయంతో భారత ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందన్నారు. ITIల శిక్షణా మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు/UTలకు నిధులు అందించబడ్డాయని వివరించారు.
STRIVE ప్రాజెక్ట్ కింద లెర్నింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేయడానికి, అప్గ్రేడ్ చేయడానికి, మెరుగుపరచడానికి నెల్లూరులోని రెండు ప్రభుత్వ ITIలు, తడలోని ఒక ప్రభుత్వ ITI గుర్తించబడ్డాయని పేర్కొన్నారు. నెల్లూరులోకి ఐటీఐలకు ఒక్కోదానికి రూ.1.43 కోట్ల నిధులు కేటాయించగా, తడ ఐటీఐకి రూ.1.23 కోట్లు అందించినట్లు వివరించారు. ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, మోటార్ మెకానిక్ వెహికల్ (MMV), ఎలక్ట్రానిక్ మెకానిక్, R&AC & వెల్డర్ వంటి వివిధ ట్రేడ్లలో తాజా ఉపకరణాలు, పరికరాలు, యంత్రాల సేకరణ కోసం రాష్ట్రాలు ఈ నిధులను ఉపయోగించాయని వివరించారు. ఇక STRIVE ప్రాజెక్ట్ ను 31 మే, 2024 నుంచి అమలు చేయడం లేదని వివరించారు.