*స్కూల్ బస్సు ప్రమాదంపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆరా..*
– గాయపడ్డ విద్యార్థిని ఫోన్లో పరామర్శించిన ఎమ్మెల్యే
బుచ్చిరెడ్డి పాళెం మండలం మినగల్లు వద్ద రోడ్డు వద్ద సోమవారం స్కూల్ బస్సు ప్రమాదానికి గురవడంపై కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఆరా తీశారు. ప్రమాదంలో గాయపడిన పిల్లల ఆరోగ్యం పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తీవ్ర గాయాల పాలైన క్రాంతి సందేశ్ అనే విద్యార్థి ఆరోగ్య పరిస్థితిపై విద్యార్థి తండ్రి రమేష్ కు ఫోన్ చేసి పరామర్శించారు. బస్సులో ప్రయాణిస్తున్న 25 మంది విద్యార్థులు సురక్షితంగా ఉన్నట్టు ఆమె తెలిపారు. ఏదైనా అత్యవసరం అయితే తనను సంప్రదించాలని, అన్ని వేలలా అందుబాటులో ఉంటానని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.