సోలార్ విద్యుత్తు ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించండి
– కమిషనర్ సూర్య తేజ ఐ.ఏ.ఎస్.,
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సూర్య ఘర్ బిజిలి పథకంపై ప్రజలకు అవగాహన కల్పించి అతి తక్కువ ఖర్చుతో సోలార్ విద్యుత్ ను ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ వార్డు సచివాలయ ఎనర్జీ సెక్రటరీలకు సూచించారు.
పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా కమిషనర్ శుక్రవారం 23వ డివిజన్ పడారుపల్లి,చలపతి నగర్, సుందరయ్య కాలనీలో పర్యటించారు.
ఈ సందర్భంగా వివిధ అంశాలపై కమిషనర్ స్పందిస్తూ రోడ్డుపై ట్రాఫిక్ కు ఇబ్బందికరంగా రోడ్డుపై నిలిపి ఉన్న పాత ఉపయోగంలో లేని వాహనములను వెంటనే పోలీసు వారి సహకారంతో తొలగించవలసినదిగా టౌన్ ప్లానింగ్ సిబ్బందిని ఆదేశించారు. రోడ్డుపై ఎత్తుగా ఉన్న పలకలను తొలగించి సమాంతరంగా చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కమీషనర్ ఆదేశించారు.
జెసిబిల సహాయంతో ప్రజలకు అసౌకర్యంగా ఉన్నటువంటి ఖాళీ స్థలలో ఉన్న పిచ్చి మొక్కలను యజమానులకు నోటీసులు ఇచ్చి వారి స్వంత ఖర్చులతో పరిశుభ్రంగా ఉంచుకునేలా చర్యలు తీసుకోవాలని శానిటేషన్ సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు.
జంక్షన్ పాయింట్ల వద్ద చిన్న లైట్లను తొలగించి అదే స్థానంలో పెద్ద హై మాక్స్ లైట్లు అమర్చాలని కమిషనర్ ఇంజనీర్ లైటింగ్ విభాగం వారికి సూచించారు. ఎనర్జీ సెక్రటరీకి సచివాలయ పరిధిలో ఇళ్లకు సోలార్ పలకలను ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు చైతన్యం కలిగేలా అవగాహన కల్పించాలని సూచించారు.
అలాగే పడారుపల్లి వద్ద ఉన్న పార్కును పరిశీలించి అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్ పరికరాలను పరిశీలించారు. అనంతరం ఇంజనీరింగ్ సిబ్బందికి పార్కు నిర్వహణ, రక్షణ కోసం వాచ్మెన్ ను నియమించి పార్కు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. శానిటేషన్ సిబ్బంది చేత పార్కు మొత్తం శుభ్రం చేయవలసిందిగా అలాగే అడిషనల్ డైరెక్టర్ హార్టికల్చర్ ప్రదీప్ కుమార్ ని గ్రీనరీ కొరకు చెట్లు నాటించమని సూచించారు.
పడారు పల్లి వద్ద పందులు, కుక్కల వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకోమని సూచించారు. సుందరయ్య కాలనీ నేషనల్ హైవే వద్ద పెద్ద కాలువ పారుదలకు ఇబ్బందికరంగా ఉన్న దగ్గర నేషనల్ హైవే అధికారుల ద్వారా సులభంగా నీరు వెళ్లేందుకు తగిన చర్యలు తీసుకుంటామని స్థానిక ప్రజలకు తెలియజేశారు.
డివిజన్ పరిధిలో పాడైన డస్ట్ బిన్ లను తొలగించి వాటి స్థానంలో కొత్త డస్ట్ బిన్లు ఏర్పాటు చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాసులరెడ్డి, ప్రజా ప్రతినిధులు, సూపరింటెండెంట్ ఇంజనీర్ రామ్మోహన్ రావు, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శేషగిరిరావు, వెటర్నరీ డాక్టర్ మదన్ మోహన్, అడిషనల్ డైరెక్టర్ హార్టికల్చర్ ప్రదీప్ కుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ప్రసాదు, ముజాహిద్దీన్, రెవిన్యూ ఆఫీసర్ ఇనాయతుల్లా, సర్వేయర్ కామేశ్వరరావు, సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.