*”సోమిరెడ్డి అవినీతి, ఆధారాలతో సహా బట్టబయలు చేసిన కాకాణి”*
*SPS నెల్లూరు జిల్లా:*
*తేది:24-02-2025*
*నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సోమిరెడ్డి అవినీతిని సాక్ష్యాధారాలతో సహా మీడియాకు వివరించిన మాజీ మంత్రి మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు*
*మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కామెంట్స్..:*
👉 టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రకృతి వనరులు దోపిడీకి గురవుతున్నాయి
👉 సర్వేపల్లి నియోజకవర్గం లో రూ.100 కోట్ల మేర ఇసుక దోపిడీ కి సోమిరెడ్డి స్కెచ్ వేశారని ఆరోపించా… ఇవిగో ఆధారాలు
👉 ఇటీవల జిల్లా మైనింగ్ అధికారి విరువూరు వద్ద అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీ…టిప్పర్ లను పట్టుకున్నారు
👉 విరువూరు రీచ్ కు అనుమతి లేకపోయినా ఇసుకను తవ్వుతున్నారు.
👉వాహనాలను పట్టుకున్న అధికారిని సోమిరెడ్డి బెదిరించారు.
👉రీచ్ లో ఇసుకను తీసుకెళ్లే దారులను తెగ్గొట్టారు.
👉 టిడిపి నేతలు సూచించిన దారుల్లోనే వెళ్లాలని చెబుతున్నారు
👉 సోమిరెడ్డి ఇష్టానుసారంగా సర్వేపల్లిలో సహజ సంపదను దోపిడీ చేస్తున్నారు
👉అధికారులను బెదిరించి మరీ సోమిరెడ్డి దోచుకుంటున్నారు.
👉ఇరిగేషన్ కాలువలలో పూడికలు తీయకుండానే బిల్లులు చేసుకున్నారు.
👉దీనివల్ల నీరు చివరకు చేరక రైతులు ఇబ్బంది పడుతున్నారు.
👉 సర్వేపల్లిలో అనధికార బార్లను నిర్వహిస్తున్నారు
👉ఇసుక, మట్టి,ఇరిగేషన్ కాలువలు,గ్రావెల్, బూడిద లలో అక్రమాలతో పాటూ, అనధికారికంగా బెల్ట్ దుకాణాలు..బార్లను కొనసాగిస్తున్నాడు.
👉 సోమిరెడ్డి అవినీతి, అక్రమాలపై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు.
👉 జిల్లాకు కలెక్టర్..ఎస్.పి.లు ఉన్నా… లేనట్టుగా ఉంది.
👉వై.సి.పి.అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతి..అధికారులపై చర్యలు తీసుకుంటాం.