*” సోమిరెడ్డిపై మాజీ మంత్రి కాకాణి మాస్ ర్యాగింగ్..”*
*గిట్టుబాటు ధర గురించి మొక్కుబడిగా చర్చించి. సమావేశం పేరిట సోమిరెడ్డి జీడిపప్పు, పిస్తాపప్పులు తినేసి, టీ తాగి వెళ్తిపోతున్నాడు.*
*SPS నెల్లూరు జిల్లా:*
*తేది:20-03-2025*
*నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రి మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*
*కాకాణి మాట్లాడుతూ..*
👉గిట్టుబాటు ధర గురించి మొక్కుబడిగా చర్చించి. సమావేశం పేరిట సోమిరెడ్డి జీడిపప్పు, పిస్తాపప్పులు తినేసి, టీ తాగి వెళ్తిపోతున్నాడు.
👉మంత్రిగా ఉన్న సమయంలో దళారులు, రైస్ మిల్లర్ల దగ్గర సోమిరెడ్డి ముడుపులు దండుకుని రైతులకు అన్యాయం చేశాడు. రైతులు ఇంకా ఆ విషయాన్ని మరిచిపోలేదు.
👉అల్లీపురంలో రైస్ మిల్లులు ఉండకూడదని సోమిరెడ్డి కలెక్టరేట్ లో సమావేశం పెట్టి, మిల్లర్ల దగ్గర పిండుకున్నాడు..
👉మరోసారి మిల్లర్స్ ని బ్లాక్ మెయిల్ చేసేందుకే సోమిరెడ్డి రివ్యూ మీటింగ్ అంటూ హడావిడి చేస్తున్నాడు. సాయంత్రానికి మిల్లర్లతో డీలింగ్ చేస్తూ బిజిగా ఉంటున్నాడు.
👉 సోమిరెడ్డి మిల్లర్లను బ్లాక్ మెయిల్ చేసి, డబ్బులు దండుకుంటూ, రైతులను నష్టపరిచే పద్దతిని మానుకోవాలి.
👉వరి కోతల సీజన్ వస్తే సోమిరెడ్డి పంట పండుతుంది తప్ప.. రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు..
👉 క్వార్జ్ మైన్స్ దగ్గరకు జిల్లాకు చెందిన నాయకులను తీసుకెళ్లి.. క్వార్జ్ యాజమాన్యాలతో డీల్ కుదుర్చుకున్నాడు.. 12 మంది నాయకులకు 12 వాటాలు ఇవ్వాలంటూ బెదిరించి, వసూల్ చేసి, ఎవ్వరికీ ఇవ్వకుండా సోమిరెడ్డే కొట్టేశాడు
👉 క్వార్జ్ విషయంలో మోసపోయిన ప్రజాప్రతినిదులందరూ ఈసారి సివిల్ సప్లయ్ మినిస్టర్ రివ్యూకి పోకుండా జాగ్రత్త పడ్డారు.
👉సోమిరెడ్డి ఈ సారి కొత్త బ్యాచ్ ను వెంటేసుకుని, మంత్రులను, కొత్త ఎమ్మెల్యేలను, కలెక్టర్ ను హోల్ సేల్ గా అమ్మేస్తున్నాడు..
👉 కొత్త ఎమ్మెల్యేలందరూ సోమిరెడ్డితో జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే క్వార్జ్ విషయంలో జరిగినదే మళ్లీ జరుగుతుంది.
👉సోమిరెడ్డి సమావేశం పెట్టినరోజే జిల్లాలో వెయ్యి రూపాయలు ధర తగ్దితే.. ఆయన ఏం చర్యలు తీసుకున్నారు..?
👉సోమిరెడ్డి కాస్త సైలెంట్ గా ఉంటేనే జిల్లా రైతులకు న్యాయం జరుగుతుంది..
👉జిల్లాలోని మిల్లర్లకు సోమిరెడ్డి నాయకుడిగా మారి.. పెద్ద దళారిగా మారి.. రైతుల పొట్టకొడుతున్నాడు..
👉సోమిరెడ్డి ఇంటి చుట్టూ.. ఇరిగేషన్ కాలువలు పూడ్చేసి లేవుట్స్ వేసుకుంటే.. వాళ్ళ దగ్గర సోమిరెడ్డి ప్యాకేజ్ తీసుకుని సైలెంట్ అయ్యాడు.
👉ఆ లేవుట్స్ లో ఇళ్లు కట్టుకునేవారి దగ్గర దండుకునేందుకు మరోసారి ఇరిగేషన్ కాలువలు ఆక్రమణ అంటూ అసెంబ్లీలో మాట్లాడాడు..
👉సోమిరెడ్డికి నిజంగా చిత్తుశుద్ది ఉంటే.. నువ్వు నిజంగా మనిషివైతే.. నీ ఇంటి చుట్టూ చెరువులు, కాలువలు ఆక్రమించారు.. దాని మీద విచారణ జరిపించే దమ్ము నీకు ఉందా..?
👉స్వంత ఊర్లో కాలువలు ఆక్రమించి లేవుట్స్ వేస్తే.. వారి దగ్గరే డబ్బులు దండుకున్న నీచ చరిత్ర నీది.. డబ్బులకు అమ్ముడుపోయిన వ్యక్తివి..
👉ప్రజాప్రతినిధులు సోమిరెడ్డి ట్రాప్ లో పడొద్దు.. వాళ్ళని కూడా సోమిరెడ్డి అమ్మేస్తాడు
👉 సోమిరెడ్డిలాంటి వ్యక్తులు దేవాలయం లాంటి అసెంబ్లీకి వెళ్లి దాని ప్రతిష్టను నాశనం చేస్తున్నారు..
👉జిల్లా ప్రజా ప్రతినిధులు, కలెక్టర్ గారు, అధికారులు బ్లాక్ మెయిలర్ సోమిరెడ్డిని లైట్ తీసుకొని, రైతులకు న్యాయం చేయడంతో పాటు, అల్లీపురం నుండే ఇరిగేషన్ కాలువల ప్రక్షాళన పనులు ప్రారంభించమని నా మనవి.