*సోమశిల అదనపు హెడ్ రెగ్యులేటర్ ను నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారుల పర్యవేక్షణలో* నిర్మించాలని ప్రాజెక్టు పర్యవేక్షణ అధికారి వెంకటరమణారెడ్డికి విజ్ఞప్తి చేసిన బిజెపి నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష*
సోమశిల _కండలేరు వరద కాలువను 12 వేల క్యూసెక్కుల నుండి 24 వేల క్యూసెక్కులకు విస్తరణ చేస్తున్నారు.
సోమశిల నుండి 24 వేల క్యూసెక్కుల నీటి విడుదల కొరకు నూతన హెడ్ రెగ్యులేటర్ నిర్మించాల్సి ఉంది.
హెడ్ రెగ్యులేటర్ నిర్మాణా విధానం ఖరారు కాకుండానే వరదకాలవ విస్తరణకు వందల కోట్లు ఖర్చు చేశారు.
పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణలో నూతన హెడ్ రెగ్యులేటర్ కు స్థలం ఉన్నందున సులభంగా నిర్మించారు. సోమశిల డ్యాంలో అలాంటి పరిస్థితి లేదు.
సోమశిల డ్యాం ప్రాజెక్ట్ రిపోర్టులో పవర్ హౌస్ లేదు.
సోమశిల డ్యామ్ పూర్తి అయిన10 సంవత్సరాల తర్వాత పవర్ హౌస్ నిర్మించారు. ఆ సమయంలో *బ్లాస్టింగ్ వలన డ్యాం లో కెమికల్ ట్రీట్మెంట్ జరిగిన విషయం పరిగణలోకి తీసుకోవాలీ*. 40 సంవత్సరాల సోమశిల డ్యాం కట్టడానికి సమస్యలు తలెత్తకుండ హెడ్ రెగ్యులేటర్ ను నిర్మించాలి.
కొండలో టన్నల్ నిర్మించాలని ప్రాజెక్ట్ అధికారులు నిర్ణయించారు.. నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారుల నివేదికను అనుసరిస్తూ నిర్మాణం చేపట్టాలని బిజెపి నేతలు డిమాండ్ చేశారు .
*జాతీయ భద్రతా కమిటీ సభ్యులు పరిశీలించేంతవరకు హెడ్ రెగ్యులేటర్ పనులు చేపట్టరాదని* పర్యవేక్షణ అధికారికి బిజెపి నేతలు విజ్ఞప్తి చేశారు..
ఈ కార్యక్రమంలో పోట్లూరు శ్రీనివాసులు. నరాల సుబ్బారెడ్డి. రఘురామయ్య. రత్నం నాయుడు. నాగలక్ష్మి. పద్మావతి. శిరీష. నారాయణ ఏవి సుబ్బయ్య. కళ్ళు భాస్కర్. ప్రభాకర్. తదితరులు పాల్గొన్నారు