*”సొమ్ము”రెడ్డిది కల్తీ బ్రతుకు – కాకాణి*
*సోమిరెడ్డి అవినీతి, అక్రమాలతో కూడిన కల్తీ బ్రతుకు బ్రతుకుతున్నాడంటూ మండిపడ్డ కాకాణి.*
*పొదలకూరు మండలంలో పలు గ్రామాల్లో పర్యటించి, అనేక కార్యక్రమాలలో పాల్గొని, రైతులు, మహిళలతో మమేకమై, అనేక అంశాలపై చర్చించిన కాకాణి.*
*రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, సకాలంలో ఎరువులు అందక ఇబ్బంది పడ్డామంటూ, కాకాణి ఎదుట గోడు వెల్లబోసుకున్న రైతులు.*
*కూటమి ప్రభుత్వం రైతులను మోసగించడంతో, అన్ని విధాలా అన్యాయానికి గురయ్యామని వాపోయిన రైతులు.*
*చంద్రబాబు నైజం తెలిసి కూడా, ఓట్లు వేసి మోసపోయామంటూ ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు.*
*SPS నెల్లూరు జిల్లా:*
*తేది:16-01-2025*
*సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, నేదురుమల్లి, వెలికంటిపాళెం, శాంతినగర్, పులికొల్లు గ్రామాలలో పర్యటించిన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*
*ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ…*
👉 చంద్రబాబు మోసాలు, సోమిరెడ్డి విచ్చలవిడి అవినీతితో సర్వేపల్లి ప్రజల బాధ వర్ణాతీతం.
👉 ఇరిగేషన్ పనులలో కొంతమంది ఇరిగేషన్ అధికారుల సహకారంతో పనులు చేయకుండానే, సోమిరెడ్డి బిల్లులు స్వాహా చేశాడు.
👉 ఇరిగేషన్ అవినీతిపై విచారణ జరిపించి, సోమిరెడ్డి, సోమిరెడ్డి కొడుకులతోపాటు, సంబంధిత ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు కూడా జైలుకు వెళ్లడం ఖాయం.
👉 ప్రభుత్వాలు ఎప్పటికీ శాశ్వతం కాదు.
👉 ప్రభుత్వం మారిన వెంటనే విచారణ జరిపించి, వాటాలు అందుకున్న ఇంజనీరింగ్ అధికారులు అందరిపై కఠినమైన చర్యలు చేపడుతాం.
👉 గత నీరు-చెట్టులో అక్రమాలు జరిగినప్పుడు ఇంజనీరింగ్ అధికారులు కాళ్లవేళ్ల బ్రతిమిలాడితే విడిచిపెట్టి, తప్పు చేశాం.
👉 ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారుల తీరు మారకపోవడం పట్ల, భవిష్యత్తులో ఖచ్చితంగా కఠిన చర్యలు చేపడతాం.
👉 అవినీతి, అన్యాయం, అక్రమాలకు కలయికతో కూడిన కల్తీ బతుకు బతికే సోమిరెడ్డిని ప్రజల సొమ్ము కక్కించేంతవరకు విడిచిపెట్టం.
👉 సూపర్ సిక్స్ పేరిట చంద్రబాబు మోసాలను ప్రజలు పదేపదే గుర్తు చేసుకుంటూ, కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
👉 ఈరోజుకి, ఈరోజు ఎన్నికలు జరిగినా, కూటమి ప్రభుత్వానికి పట్టుమని పది సీట్లు కూడా రావు.
👉 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొంది, అందిన ఆర్థిక సహాయంతో సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకునే వారమని, గతాన్ని తలుచుకొని, ప్రజలు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు.
👉 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి మారుమూల గ్రామాన్ని అభివృద్ధి చేసిన ఘనత మాదేనని గర్వంగా చెప్పగలం.
👉 అధికారం ఉన్నా, లేకపోయినా ప్రజలతో మమేకమై, ప్రజలకు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా నిలవడం బాధ్యతగా భావిస్తున్నాం.
👉 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేయడంతో పాటు నెల్లూరు జిల్లాలో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం.
👉 ఇటీవల కాలంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగయ్య నాయుడు, వెలుతుర్ల బాలిరెడ్డి, వెంకటరమణయ్య గౌడ్, తోడేరు ఎంపిటిసి సభ్యులు స్వర్ణ సుగుణమ్మ ఇళ్లకు వెళ్లి, కుటుంబసభ్యులను పరామర్శించిన కాకాణి.