సేవే వి.పి.ఆర్‌ ఫౌండేషన్‌ లక్ష్యం

– కందుకూరు నియోజకవర్గం లో 150 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్ల వితరణ
– దివ్యాంగుల కళ్ళల్లో సంతోషం.. మదినిండా ఆత్మ విశ్వాసం
– తమకు అండగా నిలబడిన వేమిరెడ్డిపై హర్షాతిరేకాలు

సేవే లక్ష్యంగా ఏర్పడిన విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరో ముఖ్యఘట్టం చోటుచేసుకుంది. కందుకూరు నియోజకవర్గంలోని దాదాపు 150 మంది దివ్యాంగులకు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ సైకిళ్ల అందజేత కార్యక్రమం ఘనంగా సాగింది. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం కందుకూరు నియోజకవర్గంలోని గుడ్లూరు మండల కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు, టిడిపి జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు, మాజీ ఎమ్మెల్యే దివిశివరం తదితరులు హాజరయ్యారు.

ట్రై సైకిళ్ల వితరణలో భాగంగా ప్రతి ఒక్కరి వద్దకు వెళ్ళిన ఎంపీ వేమిరెడ్డి.. వారి బాగోగులు, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ట్రై సైకిళ్లు ఎలా నడపాలో వారికి వివరించారు. దివ్యాంగుల సంతోషాన్ని ఆయన ప్రత్యక్ష్యంగా చూశారు. ప్రజాసేవ లక్ష్యంగా సాగుతున్న ఆయనకు దివ్యాంగులు సంపూర్ణ ఆశీస్సులు అందించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ జిల్లా ప్రజల సేవే లక్ష్యంగా 2015లో విపిఆర్ ఫౌండేషన్ స్థాపించినట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనేక గ్రామాలు తిరిగామని, ఆ సమయంలో దివ్యాంగుల అవస్థలను ప్రత్యక్షంగా చూసామన్నారు. ఆ సందర్భంగా దివ్యాంగులకు తప్పకుండా ట్రై సైకిళ్లు అందించాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. అందులో భాగంగా ప్రత్యేక టీం ద్వారా అన్ని నియోజకవర్గాల్లో సర్వే చేయిస్తూ అర్హులైన వారికి ట్రై సైకిళ్లు అందిస్తున్నామన్నారు. కందుకూరు నియోజకవర్గంలో దాదాపు 150 మందికి ట్రై సైకిల్స్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు తాము సిద్ధంగా ఉంటామని, కందుకూరు ప్రజలకు తప్పకుండా మంచి పాలన అందిస్తామన్నారు. అలాగే దివ్యాంగుల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపేలా ఇవి ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు స్వలాభం ఆశించకుండా ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, కందుకూరు నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులకు ట్రై సైకిల్స్ అందించడం శుభ పరిణామం అన్నారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి సేవలను ఆయన కొనియాడారు. జిల్లావ్యాప్తంగా ఫ్లోరైడ్ నీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వి పి ఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి తీర్చారన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యారని, ఎంపీ కాకముందు నుంచే అనేక సేవా కార్యక్రమాలు చేశారన్నారు. కందుకూరుపై ఆయన ప్రేమ ఎప్పటికి ఇలాగే ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి రాకతో టిడిపి బలం పెరిగిందన్నారు. ఒక మంచి మనిషి సేవా భావం ఉన్న వ్యక్తి జిల్లాకు ఎంపీగా ఉండడం గర్వకారణం అని కొనియాడారు. ఎంపీ వేమిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. రాజకీయాల్లోకి రాక ముందు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రజా సేవ చేస్తున్నారని గుర్తు చేశారు.

మాజీ ఎమ్మెల్యే దివి శివరాం మాట్లాడుతూ జిల్లాలో ప్రజాసేవ చేయడంలో వేమిరెడ్డి దంపతులను మించిన వారు లేరన్నారు. రాజకీయాలతో దీనికి సంబంధం లేదని, ఆయన మరిన్ని సేవా కార్యక్రమాలు కందుకూరు ప్రజలకు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి మంచి మనిషిని వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఎందుకు వదులుకున్నారో అర్థం కావడం లేదన్నారు. వేమిరెడ్డి సేవలు కందుకూరు నియోజకవర్గం అభివృద్ధికి చాలా అవసరమని, ఈమెట్ట ప్రాంతంలో మరింతమందికి ఉపయోగకర పాలన సాగించాలని కోరారు.

కార్యక్రమంలో నెల్లూరు జిల్లా బిజెపి అధ్యక్షులు వంశీ రెడ్డి , టీడీపీ నాయకులు కేతంరెడ్డి వినోద్‌రెడ్డి, బిజెపి నియోజకవర్గ కన్వీనర్ హరిబాబు, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు నార్నే రోశయ్య వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం లింగసముద్రం మండల పార్టీ అధ్యక్షులు వేముల గోపాలరావు, ఉలవపాడు మండల పార్టీ అధ్యక్షులు రాచగర్ల సుబ్బారావు, గుడ్లూరు గ్రామ పార్టీ అధ్యక్షులు వాడి శ్రీనివాసులు, గ్రామ సర్పంచ్ పాలకుర్తి శంకర్ ఎంపిటిసి చెన్నారెడ్డి వరమ్మ, పార్టీ నాయకులు పువ్వాడి వేణు రావూరి వేణు, రాఘవులు, చిత్తారి మల్లికార్జున, పొట్టేళ్ల మురళి, పిడికిటి వెంకటేశ్వర్లు రాష్ట్ర, పార్లమెంటు మరియు నియోజకవర్గ అనుబంధ సంఘాల నాయకులు అన్ని గ్రామ పార్టీ అధ్యక్షులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed