సేవా కార్యక్రమాలు చెయ్యడంలో ఆర్యవైశ్యులు ముందుంటారు
– నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి..
నెల్లూరు,
అర్యవైశ్యుల జోలికి ఎవరొచ్చినా చూస్తూ ఊరుకోనని.. వారికి అండగా ఉంటానని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి అన్నారు.. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వారు కూడా ముందుకొచ్చి పార్టీకి అండగా నిలిచారని వెల్లడించారు. వైసీపీ గూండాలను సమర్దవంతంగా ఎదుర్కొనేందుకు అనేకమంది ఆర్యవైశ్యులు తనకు నైతికంగా మద్దతిచ్చారని వెల్లడించారు.. అర్బన్ ఆర్యవైశ్య అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన దుప్పట్ల పంపిణీలో కోటంరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.. ఈ సందర్బంగా ఆయనకి ఆర్యవైశ్యులు ఘనంగా సన్మానించారు.. కన్యకా పరమేశ్వరి ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 500 మందికి కోటంరెడ్డి చేతులు మీదుగా దుప్పట్ల పంపిణీ జరిగింది. అనంతరం కోటంరెడ్డి మట్లాడారు.. ఆర్యవైశ్యులు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారని.. వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని స్పష్టం చేశారు.. ప్రజలకు ఉపయోగ పడే సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ఆర్యవైశ్యులు ముందుంటారని అన్నారు.. వారికి ఎవరు ఇబ్బంది పెట్టినా.. ఊరుకోనని.. వారికి అన్ని విధాలా అండగా ఉంటానన్నారు.. అందరి సహకారంతో గత ఐదేళ్లు పార్టీని బతికించుకున్నామన్నారు.. తల్పగిరి రంగనాథస్వామి ఆలయ చైర్మన్ విషయాన్ని మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేసిన కోటంరెడ్డి… చైర్మన్ పదవి ఆర్యవైశ్యులకు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు.. అనంతరం కొండా ప్రవీణ్ మాట్లాడుతూ.. ఐదేళ్లు నెల్లూరుసిటీలో పార్టీ బతికించిన నేత కోటంరెడ్డి అన్నారు.. ఆయన అండగా ఉండటం వల్లే వైసీపీకి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశామని ఆయన వెల్లడించారు.. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నేతలు సేగు షణ్ముఖరావు , కోట గురుబ్రహ్మం , గాదంశెట్టి హేమంత్ , తులసి శ్రీకళ ,కొండ శిరీష , కోట సత్యం, ఆర్ కే టి శేషయ్య తదితరులు పాల్గొన్నారు.